https://oktelugu.com/

Chandamama Movie: ‘చందమామ’ సినిమాలో నుంచి ఆ స్టార్ హీరోని తీసేశారు ?

Chandamama Movie: వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తాడు, మంచి అభిరుచిగల హీరో అని మంచి పేరు తెచ్చుకున్నాడు ‘అతను’, కానీ ఆ పేరు వెనుక చాలా కథే ఉంది. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి సినిమానే కెరీర్ గా మార్చుకున్నాడు, ఎక్కడా ఛాన్స్ రాలేదు, సొంత నిర్మాణంలో కర్మ అనే మొదటి సినిమా చేసి.. ఉన్నదంతా అమ్మేసుకున్నాడు. కట్ చేస్తే.. అన్నీ అప్పులు.. చీటింగ్ కేసులు.. ఎన్నో సమస్యల సుడిగుండంలో నలిగిపోయాడు. మళ్ళీ కట్ చేస్తే.. ఇప్పుడు […]

Written By:
  • Shiva
  • , Updated On : May 13, 2022 / 04:16 PM IST
    Follow us on

    Chandamama Movie: వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తాడు, మంచి అభిరుచిగల హీరో అని మంచి పేరు తెచ్చుకున్నాడు ‘అతను’, కానీ ఆ పేరు వెనుక చాలా కథే ఉంది. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి సినిమానే కెరీర్ గా మార్చుకున్నాడు, ఎక్కడా ఛాన్స్ రాలేదు, సొంత నిర్మాణంలో కర్మ అనే మొదటి సినిమా చేసి.. ఉన్నదంతా అమ్మేసుకున్నాడు. కట్ చేస్తే.. అన్నీ అప్పులు.. చీటింగ్ కేసులు.. ఎన్నో సమస్యల సుడిగుండంలో నలిగిపోయాడు. మళ్ళీ కట్ చేస్తే.. ఇప్పుడు హిట్ చిత్రాల హీరోగా మారిపోయాడు.

    ఇంతకీ ఎవరు ఆ హీరో.. మరెవరో కాదు అడివి శేషు. పదేళ్ల తన టాలీవుడ్ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఆటుపోట్లను చూశాడు. అసలు అడివి శేషు పేరు ‘ సన్నీ కృష్ణ’. ఆయన తండ్రి పేరు చంద్ర అడివి… అమెరికాలో డాక్టర్. ఆయనకు కూడా సినిమా పిచ్చి ఉంది. లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ సినిమాలో నటించే అవకాశం రాగా.. అదే సమయంలో ప్రమాదానికి గురికావడంతో అవకాశం కోల్పోయారట. అందుకే, శేష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాలు కోసం అన్నీ ఆఫీసుల చుట్టూ తిరిగే వారు.

    Adivi Sesh

    Also Read: Analysis on Secularist Governments : ప్రపంచంలో సెక్యులరిస్టు ప్రభుత్వాల స్వభావం ఎలా ఉంది?

    తాజాగా అడివి శేష్‌ ఆలీతో సరదాగా అంటూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీకి సంబంధించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘నా అసలు పేరు ‘అడివి సన్నీ కృష్ణ’.. కానీ నేను అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్‌ అని ఆటపట్టిస్తుండటంతో అడివి శేష్‌గా పేరు మార్చుకున్నాను’ అని తెలిపాడు. ఇండస్ట్రీ సంగతుల గురించి చెబుతూ.. ‘కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ మూవీ కోసం ఆడిషన్స్ కి వెళ్ళాను. పాత్ర రీత్యా పెద్ద వాడిగా కనిపించడం కోసం… పెన్సిల్ లెడ్ గడ్డంగా పూసుకొని వెళ్ళాను, కానీ అవకాశం రాలేదు అన్నారు అడివి శేషు.

    Chandamama

    అలాగే తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా చెప్పాడు. ‘చందమామ సినిమాలో నవదీప్‌ స్థానంలో నేను ఉండాల్సింది. రెండు రోజుల షూటింగ్‌ తర్వాత నన్ను ఆ సినిమా నుంచి తీసేశారు. ఆ తర్వాత సొంతంలో పెద్ద రోల్‌ ఉందన్నారు. కట్‌ చేస్తే సినిమాలో ఐదు సెకన్లున్నానంతే!’ అని శేష్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

    Also Read: Telugu Bigg Boss Non Stop: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అనసూయ.. నటరాజ్‌ పై కోపంతో ‘దుర్గ మాత’గా బిందు మాధవి !
    Recommended Videos


    Tags