KA Paul Meets Amit Shah: తెలంగాణలో పొత్తుల రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రజాక్రాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఢిల్లీలో సమావేశం కావడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో వీరి మధ్య ొత్తు కుదురుతోందా? తెలంగాణలో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల కేఏ పాల్ పై దాడి జరిగిందని తెలిసిందే. ఈ దాడితో పాల్ షాతో సమావశమై తనకు భద్రత కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం ఇది ముమ్మాటికి రాజకీయ సమావేశమే అని చెబుతున్నారు. పాల్ బీజేపీతో కుమ్మక్కయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై బీజేపీ నేతలు మాత్రం అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు.
ఎంతో బిజీగా ఉండే అమిత్ షా కేఏ పాల్ కు సమయం ఇవ్వడమేమిటని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కొత్తగా ఎత్తులకు పాల్పడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఇందులో రాజకీయ కోణం లేదని కేవవలం తనకు రక్షణ కావాలనే పాల్ షా నుకోరినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత పరిణామాల్లో బీజేపీ తీరుపై అందరికి అనుమానంగానే ఉంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టకుని రాష్ట్రంలో8 పొత్తులకు తెర తీస్తుందనే వానదలు సైతం బయటకు వస్తున్నాయి. దీంతో అమిత్ షా పాల్ కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read: Analysis on Secularist Governments : ప్రపంచంలో సెక్యులరిస్టు ప్రభుత్వాల స్వభావం ఎలా ఉంది?
శుక్రవారం బీజేపీ సభకు హాజరయ్యేందుకు అమిత్ షా సమయమివ్వడం ఈ సందర్భంలోనే కేఏపాల్ తో భేటీ రాజకీయంగా అనుమానాలకు తెర తీస్తోంది. బహిరంగసభలో వీరి పొత్తుకు సంబంధించిన అంశం చర్చకు వస్తుందనే సంశయాలు బీజేపీ నేతల్లో వస్తున్నాయి. కానీ కేవలం తనకు రక్షణ కల్పించాలనే పాల్ షాను కోరినట్లు చెబుతున్నారు. తనపై దాడులు జరిగే అవకాశాలున్నందున తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కావాలని పాల్ అభ్యర్థించినట్లు సమాచారం. మొత్తానికి పాల్ వ్యవహారం కాస్త రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.
దీంతో రాష్ట్రంలో పొత్తులకు ఇంకా సమయముందని తెలిసినా ఇప్పుడే వాటిపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎంత లాభం అనే కోణంలో పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజాక్రాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన రాజకీయ భవితవ్యం కోసం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమిత్ షా, కేఏ పాల్ భేటీతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. భవిష్యత్ లో వీరి కలయిక సాద్యమేనా అనే కోణంలో కూడా పలువురు కామెంట్లు పెట్టడం సంచలనం కలిగిస్తోంది.
Also Read: A mother’s story : కూతురు కోసం తండ్రిగా మారిన తల్లి కథ ఇదీ