ఢిల్లీకి మరో గండం..!

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో ఇప్పటికే స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే తాజాగా ఢిల్లీకి మరో సమస్య వచ్చి పడింది. ఇక్కడ చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. 17 ఏళ్ల తరువాత నవంబర్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 6.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతంలో 2003 నంబర్ లో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. […]

Written By: Suresh, Updated On : November 22, 2020 1:43 pm
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో ఇప్పటికే స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే తాజాగా ఢిల్లీకి మరో సమస్య వచ్చి పడింది. ఇక్కడ చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. 17 ఏళ్ల తరువాత నవంబర్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 6.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గతంలో 2003 నంబర్ లో అత్యల్పంగా 6.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పటి నుంచి మళ్లీ ఇంతటి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదయ్యాయి. దీంతో శ్వాస ఇబ్బందులు ఉన్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.