కేసీఆర్ ఆస్తులు పెరిగాయి.. పేద ప్రజలవి తగ్గాయి..: కేంద్రమంత్రి

తెలంగాణలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆస్తులు పెరిగాయని, పేద ప్రజల ఆస్తులు తరిగిపోయానని కేంద్ర మంత్రి జవదేకర్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో టీర్ఎస్ తప్పిదాలపై ఓ ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు. బీజేపీ మేయర్ కావాలో, ఎంఐఎం మేయర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. కేసీఆర్, ఓవైసీ లాంటి కుటుంబ పార్టీల నుంచి నగరాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే మతత్వం ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని అన్నారు.లక్షల […]

Written By: Suresh, Updated On : November 22, 2020 2:02 pm
Follow us on

తెలంగాణలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆస్తులు పెరిగాయని, పేద ప్రజల ఆస్తులు తరిగిపోయానని కేంద్ర మంత్రి జవదేకర్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో టీర్ఎస్ తప్పిదాలపై ఓ ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు. బీజేపీ మేయర్ కావాలో, ఎంఐఎం మేయర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. కేసీఆర్, ఓవైసీ లాంటి కుటుంబ పార్టీల నుంచి నగరాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే మతత్వం ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని అన్నారు.లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కేంద్రం విడుదల చేసి నిధులను కేసీఆర్ కుటుంబం దాచుకుంటోందని విమర్శించారు. మూసీ నదిని ప్రక్షాళన చేశామని టీఆర్ఎస్ సర్కార్ పదేపదే ప్రకటిస్తోందని అన్నారు.