భారత్ లో ‘కోవిషీల్డ్’ కరోనా వ్యాక్సిన్ కే తొలి అనుమతులు

కరోనా నివారణకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న ‘కోవిషీల్డ్’వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ లో మొదట ఈ వ్యాక్సిన్ కే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇండియాలోనూ ‘కోవిషీల్డ్’అత్యవసర వినియోగానికి అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు. మన దేశంలో భారత్ బయోటెక్,ఫైజర్, సీరం ఇనిస్టిట్యూట్ సంస్థలు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అనుమతి కోసం ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టారు. వీరిలో ఫైజర్ దరఖాస్తును పరిగణలోకి తీసుకోలేదు. ఇక […]

Written By: Suresh, Updated On : December 27, 2020 2:16 pm
Follow us on

కరోనా నివారణకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న ‘కోవిషీల్డ్’వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ లో మొదట ఈ వ్యాక్సిన్ కే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇండియాలోనూ ‘కోవిషీల్డ్’అత్యవసర వినియోగానికి అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు. మన దేశంలో భారత్ బయోటెక్,ఫైజర్, సీరం ఇనిస్టిట్యూట్ సంస్థలు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అనుమతి కోసం ఇప్పటికే అప్లికేషన్స్ పెట్టారు. వీరిలో ఫైజర్ దరఖాస్తును పరిగణలోకి తీసుకోలేదు. ఇక భారత్ బయోటెక్ అభివ్రుద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్’ మూడోదశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన ‘కోవిషీల్డ్’కే తొలి అనుమతులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.