https://oktelugu.com/

బీజేపీ ఆకర్ష్.. ‘మై హూనా’ అంటున్న రాములమ్మ..!

కొద్దిరోజుల క్రితమే సినీనటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తన మాతృ పార్టీలోకి తిరిగి వచ్చానని చెబుతున్న విజయశాంతి బీజేపీలో దూకుడు పెంచారు. ఆమె ప్రస్తుతం మెదక్ జిల్లా రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. Also Read: వైసీపీ, బీజేపీలు టీడీపీని టార్గెట్‌ చేశాయట.. విజయశాంతి 2009లో మెదక్‌ ఎంపీగా టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక 2018 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 27, 2020 4:39 pm
    Follow us on

    Vijayashanthi

    కొద్దిరోజుల క్రితమే సినీనటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తన మాతృ పార్టీలోకి తిరిగి వచ్చానని చెబుతున్న విజయశాంతి బీజేపీలో దూకుడు పెంచారు. ఆమె ప్రస్తుతం మెదక్ జిల్లా రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.

    Also Read: వైసీపీ, బీజేపీలు టీడీపీని టార్గెట్‌ చేశాయట..

    విజయశాంతి 2009లో మెదక్‌ ఎంపీగా టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక 2018 ముందస్తు అసెంబ్లీ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు.

    అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మాత్రం రాష్ట్రమంతా పర్యటించారు. కాగా ఇటీవల ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కాషాయకండువా కప్పుకుంది. నాటి నుంచి సీఎం కేసీఆర్ పై మాటలతూటాలు పేల్చుతోంది. అదే సమయంలో మెదక్ జిల్లాపై తిరిగి పట్టు సాధించేలా పావులు కదుపుతోంది.

    రాబోయే ఎన్నికల్లో ఆమె మెదక్ నుంచి పోటీ చేస్తారనే టాక్ విన్పిస్తోంది. ఈక్రమంలోనే తనకు కాంగ్రెస్.. టీఆర్ఎస్ లో పరిచయమున్న నేతలకు బీజేపీలోకి లాగేందుకు పావులు కదుపుతున్నారు. బీజేపీలోకి వస్తే తాను అండగా ఉంటానని హామీ ఇస్తున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

    Also Read: ఏపీ బీజేపీకి అస్త్రంగా రాజాసింగ్‌

    టీఆర్ఎస్ లోని అసంతృప్తులు.. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించిన భంగపడిన నేతలను విజయశాంతి తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. బీజేపీలో కలిసి పని చేస్తే తప్పక విజయం సాధించవచ్చని ఆమె వారితో చెబుతున్నట్లు సమాచారం.

    జిల్లాలో రఘునందన్ మినహా చెప్పుకోదగ్గ నేతలు లేరని.. అందుకే కొత్తవారికి బీజేపీలోకి తీసుకొచ్చి పార్టీలో.. వ్యక్తిగతంగా తన క్రేజ్ ను పెంచుకునేలా రాములమ్మ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే విజయశాంతి ఆకర్ష్ కు ఇతర పార్టీల నేతలు ఏమేరకు స్పందిస్తారనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్