బీహార్‌లో ఘోరం: 100 మందితో వెళ్తున్న పడవ మునక: పలువురు గల్లంతు

బీహార్‌లోని గంగానదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగి ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గల్లంతయ్యారు. ాష్ట్రంలోని భాగల్‌పూర్‌ జిల్లా నవ్‌గచ్ఛియా ప్రాంతంలో గురువారం స్థానికులు దర్శనీయా ఘాట్‌ నుంచి తీన్‌టంగా ఘాట్‌కు వెళ్లడానికి 100 మందికి పైగా పడవ ఎక్కారు. కొంతదూరం వెళ్లిన తరువాత ఆ పడవ బోల్తా పడింది. విషయం తెలియగానే ఒడ్డునే ఉన్న మత్స్యకారులు అక్కడికి వెళ్లి 30 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో సులేమా దేవి […]

Written By: Suresh, Updated On : November 5, 2020 12:58 pm
Follow us on

బీహార్‌లోని గంగానదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగి ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గల్లంతయ్యారు. ాష్ట్రంలోని భాగల్‌పూర్‌ జిల్లా నవ్‌గచ్ఛియా ప్రాంతంలో గురువారం స్థానికులు దర్శనీయా ఘాట్‌ నుంచి తీన్‌టంగా ఘాట్‌కు వెళ్లడానికి 100 మందికి పైగా పడవ ఎక్కారు. కొంతదూరం వెళ్లిన తరువాత ఆ పడవ బోల్తా పడింది. విషయం తెలియగానే ఒడ్డునే ఉన్న మత్స్యకారులు అక్కడికి వెళ్లి 30 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో సులేమా దేవి అనే మహిళ మృతి చెందగా ఐదుగురు పరిస్థితి విషయమంగా ఉండడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. సమచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరొకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా శనివారం మూడోదశ పోలింగ్‌ ఉండడంతో ఓటేసేందుకు వీరు పడవ ఎక్కి వెళ్తున్నట్లు తెలుస్తోంది.