https://oktelugu.com/

‘వకీల్ సాబ్’ పవన్ మెట్రో ప్రయాణం.. చూసి తీరాల్సిందే..!

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారాడు. బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ను నిర్మాత దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ తెలుగులో ‘వకీల్ సాబ్’గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకోగా కరోనాతో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ తాజాగా ‘వకీల్ సాబ్’ రీ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగులో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 01:00 PM IST
    Follow us on

     


    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారాడు. బాలీవుడ్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘పింక్’ను నిర్మాత దిల్ రాజు, శ్రీదేవి భర్త బోనికపూర్ తెలుగులో ‘వకీల్ సాబ్’గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకోగా కరోనాతో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తాజాగా ‘వకీల్ సాబ్’ రీ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేటి ఉదయం హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. ‘వకీల్ సాబ్’ చిత్రయూనిట్ తో కలిసి మదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు.

    Also Read: చిరంజీవి, మోహన్ బాబుల గాలి తీసిన బాలయ్య.. హాట్ కామెంట్స్

    పవన్ లాయర్ గెటప్ లోనే తోటి ప్రయాణికులతో ముచ్చటిస్తూ కన్పించారు. జనసేన అధినేత మెట్రోలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పవన్ తోపాటు నిర్మాత దిల్ రాజు సైతం మెట్రోలో ప్రయాణించారు. ఈ మూవీని త్వరగా పూర్తిచేసి సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

    Also Read: ‘గుర్తుందా శీతాకాలం’లో మరో భామ ఎవరంటే?

    ఈ మూవీలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా అంజలి.. నివేధా థామస్.. అనన్యలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘వకీల్ సాబ్’కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.