కేంద్ర సమాచార కమిషనర్‌గా సిన్హా ప్రమాణస్వీకారం

కేంద్ర సమాచార కమిషనర్‌గా యశ్వర్దన్‌ కుమార్‌ సిన్హా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 26న బిమల్‌ జుల్కా పదవీకాలం ముగిసి రెండునెలలు కావడంతో సిన్హాను సీఐసీగా ప్యానెల్‌ కమిటీ నియమించింది. దీంతో ఆయన శనివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. సిన్హా 2019 జనవరిలో సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్‌, శ్రీలంకలలో భారత హైకమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర సమాచార కమిషనర్‌గా మూడేళ్లపాటు సేవలందించనున్నారు. సాధారణంగా సీఐసీ, సమాచార కమిషనర్ల పదవీ కాలం […]

Written By: Velishala Suresh, Updated On : November 7, 2020 2:07 pm
Follow us on

కేంద్ర సమాచార కమిషనర్‌గా యశ్వర్దన్‌ కుమార్‌ సిన్హా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 26న బిమల్‌ జుల్కా పదవీకాలం ముగిసి రెండునెలలు కావడంతో సిన్హాను సీఐసీగా ప్యానెల్‌ కమిటీ నియమించింది. దీంతో ఆయన శనివారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. సిన్హా 2019 జనవరిలో సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్‌, శ్రీలంకలలో భారత హైకమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర సమాచార కమిషనర్‌గా మూడేళ్లపాటు సేవలందించనున్నారు. సాధారణంగా సీఐసీ, సమాచార కమిషనర్ల పదవీ కాలం ఐదేళ్లపాటు ఉంటుంది. కానీ సిన్హా మూడేళ్ల తరువాత రిటైరయ్యే అవకాశం ఉంది.