https://oktelugu.com/

ఫీల్ అయిన శేఖర్ కమ్ముల.. మధ్యలోనే లేచి.. !

బలమైన ఎమోషనల్ కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు టాలీవుడ్ లో మంచి పేరు ఉండటంతో.. ఆయన సినిమాల మేకింగ్ విషయంలో గాని, ఆయన కథల్లో గాని, హీరోలు నిర్మాతలు పెద్దగా ఇన్ వాల్వ్ అవ్వరు. దీనికితోడు ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో లవ్ స్టోరీ విషయంలో చైతు అస్సలు ఇన్ వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయి, సినిమా చూశాక, చైతూతో పాటు నాగార్జునకు […]

Written By:
  • admin
  • , Updated On : November 7, 2020 2:13 pm
    Follow us on

    Sekhar Kammula
    బలమైన ఎమోషనల్ కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు టాలీవుడ్ లో మంచి పేరు ఉండటంతో.. ఆయన సినిమాల మేకింగ్ విషయంలో గాని, ఆయన కథల్లో గాని, హీరోలు నిర్మాతలు పెద్దగా ఇన్ వాల్వ్ అవ్వరు. దీనికితోడు ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో లవ్ స్టోరీ విషయంలో చైతు అస్సలు ఇన్ వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయి, సినిమా చూశాక, చైతూతో పాటు నాగార్జునకు కూడా సినిమా నచ్చలేదు. దాంతో కొన్ని సీన్స్ విషయంలో కాస్త గట్టుగానే శేఖర్ కమ్ములకు మార్పులు చెప్పారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    దాంతో శేఖర్ కాస్త ఫీల్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి శేఖర్ కమ్ముల కథలు చాలా సింపుల్ గా ఉంటాయి. అయినా సినిమా సూపర్ హిట్ అవుతుంటాయి. అందుకే ఆయన నుండి సినిమా వస్తోంది అనగానే.. ఈ సారి ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ సారి ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ క్రేజీ కాంబినేషన్ తో సినిమాని చేశాడు. మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే వచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా.. లవ్ స్టోరీ చేశాడు.

    Also Read: దక్షిణాదివారి ధ్యాసంతా దానిగురించే.. మంటపుట్టించిన పూజాహెగ్డే మాటలు..!

    తీరా సినిమా చేసి.. ఫస్ట్ కాపీ టీమ్ మెంబర్స్ కి చూపిస్తే.. అది మరీ స్లోగా సీరియల్ లాగా ఉండటంతో.. మొత్తానికి మ్యాటర్ నాగ్ వరకూ వెళ్ళింది. దాంతో నాగ్ సినిమా చూసి.. ఎక్కువగా మార్పులు చెప్పాడు. అవి శేఖర్ కి అస్సలు నచ్చలేదు. దాంతో మార్పులు చేసేది లేదు అని నిర్మాతలకు నచ్చచెబుతున్నాడట. వాళ్ళు కూడా శేఖర్ మాటలకు కన్విన్స్ అవ్వట్లేదట. దాంతో శేఖర్ కమ్ముల ఫీల్ అయి మీటింగ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు.