carona
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త కేసుల నమోదు కొంతకాలం తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతుడడంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. పరిస్థతిని తాము ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని మునుపటిలా కేసులు విజృంభించకుండా జాగ్రత్తలు పాటించేలా సూచనలిస్తున్నామని ఆయన తెలిపారు. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బెలిటెన ప్రకారం ఢిల్లీలో ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 6 వేల మందికి పైగా కరోనాతో మరణించారు.