https://oktelugu.com/

స్థానిక ఎన్నికలకు వైసీపీ నై.. టీడీపీ సై..కారణమేంటి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఓ వైపు ప్రభుత్వం నై అంటుంటో.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం సై అంటోంది. అదేంటో దాని వెనుక ఉన్న పరామర్థం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరిని చూసుకొని టీడీపీ ఇంతలా ఎందుకు ఉవ్విల్లూరుతోందో కూడా అంతుబట్టని విషయం. అయితే.. ఇక్కడ ఓటు వేయాల్సింది ప్రజలనే విషయాన్ని టీడీపీ మరిచినట్లుంది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ ఇప్పటికే 2019 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీకి.. అప్పుడే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 4, 2020 1:37 pm
    Follow us on

    YCP TDP

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఓ వైపు ప్రభుత్వం నై అంటుంటో.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం సై అంటోంది. అదేంటో దాని వెనుక ఉన్న పరామర్థం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరిని చూసుకొని టీడీపీ ఇంతలా ఎందుకు ఉవ్విల్లూరుతోందో కూడా అంతుబట్టని విషయం. అయితే.. ఇక్కడ ఓటు వేయాల్సింది ప్రజలనే విషయాన్ని టీడీపీ మరిచినట్లుంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇప్పటికే 2019 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీకి.. అప్పుడే ప్రజల్లో పాజిటివ్‌ టాక్‌ వచ్చిందని ఫీల్‌ అవుతున్నట్లుంది. 2004 ఎన్నికలతో పోల్చినా ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. గెలిచిన అభ్యర్థులు కూడా నామమాత్రంగా గెలిచిన వారే. ఇక తన స‌మీప తెలుగుదేశం అభ్యర్థిపై వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అత్యంత భారీ మెజారిటీతో రాష్ట్రంలోనే నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ మెజార్టీ సాధించారు. ఇంకా చాలా మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు భారీ భారీ మెజారిటీల‌తో గెలుపొందారు. టీడీపీ కంచుకోటలో కూడా వైసీపీ అభ్యర్థులు 30 వేలకు పైచిలుకు మెజార్టీతో గెలిచారు.

    Also Read: ఏపీ మహిళలకు జగన్ శుభవార్త.. ఆదాయం చేకూరేలా కీలక నిర్ణయం..?

    అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థాయిలో చిత్తయిన టీడీపీ ఇప్పుడు ఏ ధైర్యంతో స్థానిక సంస్థల ఎన్నికల పోతోందో తెలియడం లేదు. ఎన్నిక‌లైన ఏడాదిన్నర‌లో టీడీపీ చేసింది ఏంటంటే.. ఏమీ లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన నేతలు ఇప్పుడు జనం జ‌నం మ‌ధ్య కనిపించడం లేదు. ముఖ్యంగా ఆపార్టీ అధినేతనే సైలెంట్‌ అయిపోయాడు. కరోనాతో హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కనీసం కార్యకర్తలను కూడా కలవడం లేదు. ఇక ఆయన రాజకీయ వారత్వంతో ప్రజల్లోకి వస్తున్న లోకేష్‌ కామెడీ పుట్టిస్తున్నారు.

    Also Read: దుబ్బాక ఫలితం.. గ్రేటర్‌‌పై ప్రభావం

    మరోవైపు అధికార పక్షం తన పని తాను చేసుకుపోతూనే ఉంది. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పనులు వేగంగా నడిపిస్తూనే ఉన్నారు. అయితే.. ప్రజల నుంచి కూడా అంతా పాజిటివ్‌గానే ఉన్నా జగన్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయేందుకు నిరాకరిస్తున్నారు. కోర్టు తీర్పులు టీడీపీపై సామాన్య ప్రజ‌ల్లోనూ వ్యతిరేకత తెస్తున్నాయి. దీనికితోడు మూడు రాజ‌ధానుల అంశాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండ‌టం కూడా మైనస్‌ అవుతోంది. వీట‌న్నింటినీ ప‌రిశీలిస్తే సార్వత్రిక ఎన్నిక‌ల నాటికి మించిన ప్రజా వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీపై మూటగట్టుకునే పరిస్థితే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి మేలు జరుగుతుందా..? వైసీపీ అనుకూలంగా మారుతాయా..? ఈ మాత్రం టీడీపీ అంచనా వేయకుండా ఎన్నికలకు సిద్ధపడుతుండడం ఆశ్చర్యపడాల్సిన అంశమే.