https://oktelugu.com/

రైతుల ఖాతాల్లోకి రూ.2,000. విడుదల చేసిన ప్రధాని మోదీ

దేశ రైతులకు ప్రధాన నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన కిసాన్ సమ్మాన్ నిధి నిధులు రూ. 18,000 కోట్లను శుక్రవారం ఉదయం 11 గంటలకు నరేంద్ర మోడీ విడుదల చేశారు. సుమారు 9 కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం కలగనుంది. ఈ మేరకు రైతుల సెల్ పోన్లలో రూ. 2000 జమ అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయి. 2019లో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి సంవత్సరానికి […]

Written By: , Updated On : December 25, 2020 / 12:56 PM IST
Follow us on

దేశ రైతులకు ప్రధాన నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన కిసాన్ సమ్మాన్ నిధి నిధులు రూ. 18,000 కోట్లను శుక్రవారం ఉదయం 11 గంటలకు నరేంద్ర మోడీ విడుదల చేశారు. సుమారు 9 కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం కలగనుంది. ఈ మేరకు రైతుల సెల్ పోన్లలో రూ. 2000 జమ అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయి. 2019లో కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి సంవత్సరానికి రూ.6000లను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. రూ.2000 చొప్పును మూడు విడుదలకు ఈ మొత్తాన్ని జమ చేస్తారు. సాగుభూమి ఉన్న రైతులందరికీ ఈ నగదు చేరుతుంది.