https://oktelugu.com/

జాలీగా క్రిస్మస్.. ‘మెగా’ సందడి షూరు..!

డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతీయేటా మాదిరిగానే కాకుండా ఈసారి కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల్లో క్రిస్మస్ వేడుకలు రద్దుకాగా.. మరికొన్ని దేశాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా రద్దయ్యాయి. దీంతో వారంతా ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ జరుపుకుంటున్నారు. భారత్ లో మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రముఖులంతా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 25, 2020 / 12:49 PM IST
    Follow us on

    డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతీయేటా మాదిరిగానే కాకుండా ఈసారి కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల్లో క్రిస్మస్ వేడుకలు రద్దుకాగా.. మరికొన్ని దేశాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ జరుపుకుంటున్నారు.

    యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా రద్దయ్యాయి. దీంతో వారంతా ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ జరుపుకుంటున్నారు. భారత్ లో మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు.

    క్రిస్మస్ సందర్భంగా ప్రముఖులంతా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాత్రి నుంచే క్రిస్టియన్ల ప్రార్థనలతో వేడుకలు షూరు అయ్యాయి.

    ఇక టాలీవుడ్ లోనూ క్రిస్మస్ సంబరాలు మిన్నంటాయి. నటీనటులంతా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు.

    మెగా పవర్ స్టార్ రాంచరణ్.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అల్లు అర్జున్.. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. మెగా అల్లుడు కల్యాణ్ దేవ్.. స్నేహా రెడ్డి.. ఉపాసన.. నిహారిక‌.. చైత‌న్య‌.. శిరీష్.. సుస్మిత‌.. శ్రీజ‌.. త‌దిత‌రులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.

    క్రిస్మస్ పార్టీలో వీరంతా కలిసి సందడి చేసిన ఫోటోను అల్లు శిరీష్ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి అంద‌రికి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. దీనికి మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్లో స్పందిస్తూ ‘క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

    ‘క్రిస్మస్‌ మ్యాజిక్‌‌ మన జీవితాల్లో ఆనందాన్ని.. చిరునవ్వును నింపుతుందని ఆశిద్దాం.. ఈ పండుగ హాలీడే సీజన్‌ మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని కోరుకుంటున్నా’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.