ఉత్తరప్రదేశ్‌లో అర్ధరాత్రి అంత్యక్రియలు.. కుటుంబ సభ్యులనూ అనుమతించలేదు..

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో అత్యాచార బాధితురాలి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన రేకెత్తింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని పోలీసుల వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులను సైతం అనుమతించలేదు. అంతేకాదు వారు రాకుండా ఇళ్లకు తాళం కూడా వేసి పోలీసులు భారీగా మోహరించారు. […]

Written By: NARESH, Updated On : September 30, 2020 2:28 pm

Rape in uttarapradesh

Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో అత్యాచార బాధితురాలి మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన రేకెత్తింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని పోలీసుల వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులను సైతం అనుమతించలేదు. అంతేకాదు వారు రాకుండా ఇళ్లకు తాళం కూడా వేసి పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు