https://oktelugu.com/

అనుష్క పెళ్లిపై క్లారిటీ వచ్చేసినట్టేనా?

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ లాక్డౌన్ వల్ల పేదలు, వలస కార్మికులు, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికీ లాక్డౌన్ శాపంగా మారగా మరికొందరికీ మాత్రం వరంగా మారింది. Also Read: ‘మోస‌గాళ్లు’ స్కామ్ బ‌య‌ట‌పెట్ట‌నున్న అల్లు అర్జున్‌! నిత్యం బీజీగా ఉండే సెలబ్రెటీలకు లాక్డౌన్ ఒక ఆటవిడుపుగా మారింది. ఫ్యామిలీ లైఫ్ కు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 11:17 AM IST

    anushka fin

    Follow us on

    చైనాలోని వూహాన్లో సోకిన కరోనా క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. కరోనా మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఈ లాక్డౌన్ వల్ల పేదలు, వలస కార్మికులు, మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరికీ లాక్డౌన్ శాపంగా మారగా మరికొందరికీ మాత్రం వరంగా మారింది.

    Also Read: ‘మోస‌గాళ్లు’ స్కామ్ బ‌య‌ట‌పెట్ట‌నున్న అల్లు అర్జున్‌!

    నిత్యం బీజీగా ఉండే సెలబ్రెటీలకు లాక్డౌన్ ఒక ఆటవిడుపుగా మారింది. ఫ్యామిలీ లైఫ్ కు దూరంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా పరిగెత్తె సెలబ్రెటీలకు లాక్డౌన్ బ్రేక్ వేసింది. దీంతో వారు కొంత సమయాన్ని తమకు తాము కేటాయించుకున్నారు. కొందరు సెలబ్రెటీలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగా మరికొందరు లాక్డౌన్లో తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేశారు.

    లాక్డౌన్లోనూ అనుష్క పెళ్లిపై చాలా పుకార్లు షికార్లు చేశారు. అనుష్క శెట్టికి 38ఏళ్ల వయస్సు వచ్చినా ఇంకా 18ఏళ్ల భామల్లాగే హోయలు పోతుంటుంది. అనుష్కకు పెళ్లీడు దాటిపోయే చాలారోజులైనా మ్యారేజ్ లైఫ్ గురించి ఇంకా పెద్దగా ఆలోచించినట్లు కన్పించడం లేదు. మీడియాకు తప్ప ఆమె పెళ్లిపై అభిమానులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఇక తాజాగా తన పెళ్లిపై వచ్చిన పుకార్లపై అనుష్క పరోక్షంగా సంకేతాలిచ్చింది.

    లాక్డౌన్ సమయం తనకు దేవుడి ఇచ్చిన వరమని చెప్పింది. ఇన్నాళ్లూ సినిమాలతో బీజీగా గడుపుతూ ఓ రకమైన ఒత్తిడికి గురయ్యానని చెప్పింది. లాక్డౌన్లో తాను ఎలాంటి రూల్స్ పెట్టుకోలేదని.. తన మనసుకు నచ్చినట్టు బతికానని.. ప్రతీ నిమిషాన్ని ఎంజాయ్ చేసినట్లు అనుష్క చెప్పింది.

    Also Read: బిగ్ బాస్ పై దేవి నాగవల్లి సంచలన ఆరోపణలు !

    లాక్డౌన్ సమయంలో తాను చాలా కథలను విన్నానని అనుష్క చెప్పింది. అయితే వాటిలో రెండు ప్రాజెక్టులు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పింది. ఆ సినిమాల్లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని చెప్పింది. వచ్చే జనవరి నుంచి మళ్లీ బీజీగా మారబోతున్నట్లు చెప్పింది. ‘బొమ్మాళీ’ మళ్లీ సినిమాలతో బీజీగా మారుతుండటంతో ఇప్పట్లో అనుష్క పెళ్లి ఉండబోదనే క్లారిటీ ఇచ్చింది. ‘నిశబ్ధం’ తన చివరి సినిమా అనే మాటలకు ‘స్వీటీ’ ఇలా పుల్ స్టాప్ పెట్టేసింది.