https://oktelugu.com/

బిగ్ బాస్ పై దేవి నాగవల్లి సంచలన ఆరోపణలు !

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న దేవి నాగవల్లి సడెన్ గా ఎలిమినేట్ కావడం, పైగా ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురిలో.. తక్కువ ఓట్లు పొందిన కారణంగానే దేవిని ఎలిమినేట్ చేస్తోన్నట్లు నాగార్జున ప్రకటించడం కూడా ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది. నిజానికి ఎలిమినేషన్ లిస్ట్ లో వున్న వారిలో దేవి నాగవల్లినే బాగా తెలిసిన వ్యక్తి.. పైగా ఆమెకు ఓట్లు కూడా ఎక్కువగా పోల్ అవుతున్నాయని సమాచారం. అయినా ఆమెనే […]

Written By:
  • admin
  • , Updated On : September 30, 2020 / 11:33 AM IST
    Follow us on


    బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న దేవి నాగవల్లి సడెన్ గా ఎలిమినేట్ కావడం, పైగా ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురిలో.. తక్కువ ఓట్లు పొందిన కారణంగానే దేవిని ఎలిమినేట్ చేస్తోన్నట్లు నాగార్జున ప్రకటించడం కూడా ప్రేక్షకులను షాక్ కి గురి చేసింది. నిజానికి ఎలిమినేషన్ లిస్ట్ లో వున్న వారిలో దేవి నాగవల్లినే బాగా తెలిసిన వ్యక్తి.. పైగా ఆమెకు ఓట్లు కూడా ఎక్కువగా పోల్ అవుతున్నాయని సమాచారం. అయినా ఆమెనే ఎందుకు ఎలిమినేట్ చేశారు ? బిగ్ బాస్ ఫాలోవర్స్ ను ఇప్పుడు ఇదే అనేక అనుమానాలకు గురిచేస్తోంది. ఇక తాజాగా దేవి నాగవల్లి సంతోషం సురేష్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన సంచలన విషయాలను బయటపెట్టింది. అన్ని విషయాల్లో పెర్ఫెక్ట్ గా ఉన్న తనని ఎలిమినేట్ చేయడం వెనుక బిగ్ బాస్ డ్రామా ఉందని.. అసలు తనని ఎందుకు ఎలిమినేట్ చేశారా అని ఇప్పటికీ డైలమాలో ఉన్నానని ఆమె తెలిపింది.

    Also Read: బన్నీ ‘పుష్ప’ పై క్రేజీ రూమర్ !

    హౌస్ లో ఓ భం చిక్ అనే బూతు యాడ్ కి నేను నో చెప్పాను. కానీ అలాంటి వాటికి నా ఎలిమినేషన్ ను నేను ఉహించలేదు. అసలు నన్ను ఎందుకు బయటకు పంపిస్తున్నారు.. వీళ్లకు డ్రామా కావాలేమో. అయితే, నా వృత్తికి లింక్ పెట్టి నన్ను ఎలిమినేట్ చేసి ఉంటే మాత్రం.. బిగ్ బాస్ నాకు అన్యాయం చేసినట్టే. ఏమైనా నేను ఏ తప్పు చేయకుండానే బయటకు వచ్చేశాను అని బిగ్ బాస్ పై ఆమె కొన్ని సంచలన ఆరోపణలను చేసింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. తనకు పెళ్లి అయిందని.. ఒక బాబు కూడా ఉన్నాడని.. కానీ భర్తతో విడిపోయానని తెలిపింది. అలాగే ఆమె అతి సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి అట. అవును, నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడు నాకు కల్చర్ తెలియదు, రెండు జళ్ళతో అసలు డ్రెస్ సెన్స్ లేకుండా వచ్చాను. ఇంగ్లీష్ కూడా రాదు. అంటే, అలాంటి స్థితి నుండి.. ఆమె ఓ టాప్ ఛానెల్ లో ప్రముఖ యాంకర్ గా ఎదగడానికి మొత్తానికి తనను తాను చాలా మార్చుకుంది.

    Also Read: టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు?

    ఇక తన వృత్తిలో చోటు చేసుకున్న తీవ్ర విషాదాంత సంఘటనలను కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఓ బస్ ప్రమాదంలో ఒకేసారి నలభై మంది చనిపోయారు. నేను ఆ సమయంలో అక్కడికి వెళ్లి.. వారి శవాలను కవర్ చేయాల్సి వచ్చింది.. అప్పుడు వారి డెడ్ బాడీలను ఊహించుకుని అంటూ దేవి ఎమోషనల్ అయింది. అలాగే మరో సంఘటన గురించి చెప్తూ.. షకీలా ఇంటర్వ్యూ కోసం ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు.. అక్కడ షకీలా ఆర్ధిక పరిస్థితి చూసి దేవి షాక్ కి గురి అయిందట. ప్రస్తుతం షకీలా ఓ చిన్న గదిలో రోజులను కష్టంగా గడుపుతోంది. ఇక విజయ్ దేవరకొండతో చేసిన ఇంటర్వ్యూలో కూడా విజయ్ అభిప్రాయాలు, నా అభిప్రాయాలు ఫైట్ చేసుకున్నాయి. అలా ప్రముఖులను అడిగే ఇబ్బందికర ప్రశ్నల గురించి కూడా దేవి వివరణ ఇచ్చింది. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించే కాకుండా తన గురించి కూడా దేవి ఎన్నో సంచలన రహస్యాలను బయట పెట్టింది.