
కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు తమ కార్యాచరణను ప్రకటించారు. ఈనెల 26వరకు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే గణతంత్ర దినోత్సవాన ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఈ పరేడ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈనెల 23న ప్రతి రాష్ట్రంలోని గవర్నర్ నివాసం ముట్టడిస్తామని క్రాంతి కారి కిసాన్ యూనియర్ అధ్యక్షుడు దర్శన్ పాల్ తెలిపారు. కాగా ఇదివరకు ప్రభుత్వం జరిపిన చర్చల్లో కాస్త పురోగతి సాధించినా వ్యవసాయ చట్టాలపై మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు రైతులు. వ్యవసాయ చట్టాలు రద్దు చేసేవరకు ఆందోళన సాగిస్తామంటున్నారు.