https://oktelugu.com/

పల్లెల నుంచే ఐటీ సేవలు

ఎప్పుడైతే రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించిందో.. అప్పటి నుంచే చాలా వరకు ఆఫీసులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగా ఐటీ ఎంప్లాయిస్‌ ఇంకా కూడా ఇళ్ల నుంచే వర్క్‌ చేస్తున్నారు. అయితే.. మరోవైపు కరోనా తగ్గుముకం పట్టి పలు కంపెనీలు తెరుచుకున్నా హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌, ఐటీ ఆధారిత సేవల కంపెనీల్లోని 95 శాతానికి పైగా ఉద్యోగులు ఇంకా ఇంటి నుంచే పని (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) చేస్తున్నారని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) వెల్లడించింది. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 2, 2021 / 03:22 PM IST
    Follow us on


    ఎప్పుడైతే రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించిందో.. అప్పటి నుంచే చాలా వరకు ఆఫీసులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగా ఐటీ ఎంప్లాయిస్‌ ఇంకా కూడా ఇళ్ల నుంచే వర్క్‌ చేస్తున్నారు. అయితే.. మరోవైపు కరోనా తగ్గుముకం పట్టి పలు కంపెనీలు తెరుచుకున్నా హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌, ఐటీ ఆధారిత సేవల కంపెనీల్లోని 95 శాతానికి పైగా ఉద్యోగులు ఇంకా ఇంటి నుంచే పని (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) చేస్తున్నారని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) వెల్లడించింది.

    Also Read: బీజేపీ వర్సెస్‌ జనసేన..: ఆ సీటు కోసమేనా..?

    ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసుకు రావడం ఇప్పట్లో జరిగేలా లేదు. ఈ ఏడాది సగం గడిస్తే కానీ పుంజుకునేలా లేదు. క్రమక్రమంగా సంవత్సరాంతం నాటి కల్లా గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు హైసియా తన అధ్యయనంలో పేర్కొంది. 90 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ ఐటీ కంపెనీల్లో ఉత్పాదకత అధికంగానే ఉందట. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల్లో 50 శాతం మంది వరకూ సొంత ఊరెళ్లిపోయారు. అక్కడి నుంచే పని చేస్తున్నారు. ఉద్యోగులు అనేక ప్రాంతాల నుంచి పని చేస్తున్నందున ఆర్‌టీఓ కొత్త క్లిష్టతను సంతరించుకుంది. కోవిడ్‌కు ముందున్న పరిస్థితులను భవిష్యత్తులో చూడలేమని కంపెనీలు సైతం పేర్కొంటున్నాయి.

    హైదరాబాద్‌ ఐటీ రంగంలోని 50 శాతానికి పైగా కంపెనీలు తమ ఉద్యోగుల్లో 25 శాతం మంది ఉద్యోగులు ఊరెళ్లి అక్కడి నుంచే పని చేస్తున్నారని వెల్లడించాయి. 25 శాతం కంపెనీల్లో 50 శాతానికి పైగా ఉద్యోగులు సొంతూళ్లలోనే ఉన్నారు. తమ ఉద్యోగుల్లో 25 శాతం మంది హైదరాబాద్‌లో లేరని 50 శాతానికి పైగా పెద్ద, అతిపెద్ద కంపెనీలు వెల్లడించాయి. కాగా ఊరెళ్లి అక్కడి నుంచే పని చేస్తున్న ఉద్యోగులు మళ్లీ హైదరాబాద్‌కు ఎప్పుడు వస్తారన్నది చెప్పడం కష్టమేనని అంటున్నాయి.

    Also Read: శ్రీరాముడి చుట్టే ఏపీ రాజకీయాలు..: రామతీర్థానికి చంద్రబాబు

    ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి 20 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేసేలా ఏర్పాటు చేసుకోవాలని 60 శాతం కంపెనీలు యోచిస్తున్నాయి. జూన్‌ నాటికి ఇది 40 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి పెద్ద, అతిపెద్ద ఐటీ కంపెనీల్లో కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు 50 నుంచి 70 శాతం ఉండవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. కానీ.. కంపెనీలు కూడా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తేనే తమకూ కొన్ని లాభాలు ఉన్నాయని భావిస్తున్నట్లు సమాచారం.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్