సూపర్ స్టార్ రజనీకాంత్ కు చైన్నైలోని తన నివాసంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి లత హారతితో స్వాగతం పలికారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రజనీ నేరుగా తన ఇంటికే వెళ్లారు. నిన్న రజనీని డిశ్చార్జి చేసిన వైద్యులు ఆయనకు వారం రోజుల విశ్రాంతి అవసరం అన్నారు. ఈనెల 25న హైబీపీతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో రజనీకాంత్ జాయిన్ అయిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం ఆయన చెన్నై లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా ఆయన ఈనెల 31న పార్టీపై ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో ఆయన ఆరోగ్య రీత్యా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది.