https://oktelugu.com/

2020: తెలుగు యువ దర్శకులు తీసిన దృశ్య కావ్యాలు

కరోనా విజృంభణతో మానవ జీవితం ఇంటికే పరిమితమైన తరుణంలో “సినిమా” అనేది కొంత ఉపశమనాన్ని కలిగించింది. లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు హోం థియేటర్లుగా మారిపోయాయి. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ప్రతి ఏటాలానే టాలీవుడ్ 2020 లో కొన్ని మంచి సినిమాలను ప్రజలకు అందించిందిగతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలు ఎక్కువగా నిర్మాణమవుతున్నాయి.అభివృద్ధి చెందిన టెక్నాలజీ వలన దర్శక నిర్మాతలలో వచ్చిన మార్పునే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 4:39 pm
    Telugu Films
    Follow us on

    కరోనా విజృంభణతో మానవ జీవితం ఇంటికే పరిమితమైన తరుణంలో “సినిమా” అనేది కొంత ఉపశమనాన్ని కలిగించింది. లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు హోం థియేటర్లుగా మారిపోయాయి. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ప్రతి ఏటాలానే టాలీవుడ్ 2020 లో కొన్ని మంచి సినిమాలను ప్రజలకు అందించిందిగతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలు ఎక్కువగా నిర్మాణమవుతున్నాయి.అభివృద్ధి చెందిన టెక్నాలజీ వలన దర్శక నిర్మాతలలో వచ్చిన మార్పునే దీనికి కారణంగా కనిపిస్తుంది. 2020వ సంవత్సరం మరో మూడు రోజులలో ముగియబోతుంది. ఈ సంవత్సరం ప్రతిభావంతులైన యువ దర్శకుల నుండి ప్రేక్షకుల ముందుకి వచ్చిన కొన్ని సినిమాలు గుర్తుకుచేసుకుందాం.
    color photo

    1.కలర్ ఫోటో- IMDB (8.3)

    తెలుగు తెరపై ప్రేమ కథా చిత్రాలు ఎన్నో వచ్చి ప్రేక్షకులను మంచి అనుభూతిని పంచాయి. కులం, మతం, వర్ణానికి వ్యతిరేకంగా ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. అలాంటి కోవలోనే మళ్లీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడానికి వచ్చిన ప్రేమ కథ కలర్ ఫోటో. దసరా పండుగ సమయంలో పెద్ద సినిమాలు లేక అసహనం, అసంతృప్తితో ఉన్న ప్రేక్షకులకు కలర్ ఫోటో మంచి అనుభూతిని అందించింది. సందీప్ రాజ్ తన తోలి చిత్రంగా ఇలాంటి డిఫరెంట్ కథతో ముందుకు రావటం సాహసమనే చెప్పాలి. అందమైన ప్రేమ కథను అందించాలనే తపన దర్శకుడిలో కనిపిస్తుంది.సుహాస్ నటన, చాందిని పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. వైవా హర్ష,సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఇయర్ విడుదలైన చిత్రాలన్నింటిలో మంచి రేటింగ్స్ తో టాప్ పొజిషన్లో ఉంది.

    Also Read: ‘ఆచార్య’లో మెగాస్టార్ తో మెహబూబ్!

    2. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య- IMDB (7.9)

    తొలి చిత్రం ‘C/o కంచరపాలెం’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వెంకటేష్ మహా ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమాతో ఈ సంవత్సరం ప్రేక్షకులని అలరించాడు.ఇది జాతీయ అవార్డును అందుకున్న‌ “మ‌హేషింటే ప్ర‌తీకార‌మ్” అనే మ‌ల‌యాళ సినిమాకు రీమేక్‌గా తెరెకెక్కింది.అమాయకత్వం, ప్రేమ, అప్యాయతలు, కలుపుగోలుదనం వీటన్నంటిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించటంలో మహా సక్సెస్ అయ్యారు.సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించగా, నరేష్,సుహాస్, రాఘవన్,హరి చందన,రూప ప్రధాన పాత్రల్లో నటించారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డేవారు మాత్రం దీన్ని కాస్త ఓపిక‌గా చూడాల్సిందే.

    3. మిడిల్ క్లాస్ మెలోడీలు-IMDB (7.7)

    యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న విడుదలైంది.తొలి చిత్ర దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించిన `మిడిల్ క్లాస్ మెలోడీస్` కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆనంద్ దేవరకొండ,వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రలలో నటించగా, చైతన్య గరికపాటి,దివ్య శ్రీపాద,గోపరాజు రమణ,ప్రేమ్ సాగర్ సురభి ప్రభావతి సహాయక పాత్రల్లో నటించారు.చాలా సరదాగా వినోదాన్ని పంచుతూ సాగుతూ ఎక్కడా ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. కుటుంబంతో కలిసి హాయిగా చూడదగిన సినిమా.

    4. HIT: మొదటి కేసు IMDB (7.7)

    నాని నిర్మాతగా, విశ్వక్సేన్ హీరోగా వచ్చిన చిత్రం హిట్.మూసధోరణిలో పోకుండా కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్న యువ దర్శకుల జాబితాలో HIT చిత్ర దర్శకుడు శైలేష్ కోలా కూడా చేరారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనంలో అందర్నీ కట్టిపడేశాడు. ఎక్కడా కూడా అనుమానం రాకుండా.. చక్కటి స్క్రీన్‌ప్లే ఊపిరి బిగపట్టుకుని చూసేలా మలిచాడు. ఈ సినిమాతో శైలేష్ కొలను తన ప్రతిభను నిరూపించుకున్నాడు.విశ్వక్సేన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రలలో కనిపించగా,మురళీ శర్మ, భానుచందర్, బ్రహ్మాజీ, హరితేజ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. హరితేజ పాత్ర కాస్త కొత్తగా అనిపిస్తుంది.

    Also Read: రెండు రీమేక్‌లు.. రెండు ఫ్లాష్‌బ్యాక్‌లు..

    5. పలాస – IMDB (7.5)

    శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్‌, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణకుమార్‌ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు.చాలా తక్కువ సినిమాలు మాత్రమే విడుదలకు ముందే గ్యారంటీ హిట్ అనే గుర్తింపు,నమ్మకం ప్రేక్షకులకు కలిగించగలుగుతాయి. ఈ మధ్యకాలంలో అలాంటి గుర్తింపు, నమ్మకం కలిగించిన సినిమా ‘పలాస 1978’.ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థ డిస్ట్రిబ్యూట్ చెయ్యడంతో పలాస పై చాలామందికి ఆసక్తి ఏర్పడింది. అలా అంచనాలు లేని స్థితి నుండి భారీ అంచనాలు ఏర్పడే స్థాయికి వెళ్లిన పలాస 1978 ప్రేక్షకుల ముందుకు మర్చి 6న వచ్చింది.డిఫరెంట్ కాన్సెప్ట్ తో కరుణ కుమార్ కి తొలి ప్రయత్నమే విమర్శకుల ప్రశంసలు దక్కాయి.1978 సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన సంఘటనలకు తెర రూపమిచ్చిన తీరు ప్రశంసలు అందుకుంది.

    6. భానుమతి & రామకృష్ణ-IMDB (7.0)

    తెలుగు ప్రేక్షకులకు ప్రేమకథలు కొత్తేమీకాదు. ఇప్పటికే చాలా రకాల ప్రేమకథలను వెండితెరపై చూశారు. ఇది కూడా అలాంటి ఒక ప్రేమకథే. భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ 30 ఏళ్ల అమ్మాయి, 33 ఏళ్ల అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాన్ని దర్శకుడు శ్రీకాంత్ నాగోతి చాలా చక్కగా ఆవిష్కరించారు.ఈ చిత్రంలో నవీన్ చంద్ర,సలోనీ లుథ్రా ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. భానుమతి రామకృష్ణ అందమైన ప్రేమకథ. సున్నితమైన ప్రేమకథలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్