పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వైఖరికి నిరసనగా ఆప్ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అసెంబ్లీలోనే ఉన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లును మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ చట్టం ముసాయిదా కాపీని తమతో పంచుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీ భవనంలోనే రాత్రంతా ఉండి ఆందోళన చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న వ్యవసాయ చట్టాలను ఉపయోగించడం ద్వారా నూతన చట్టాలను తిరస్కరించాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.