https://oktelugu.com/

ఈ స్కీమ్ లో డబ్బు పెడితే కళ్లు చెదిరే లాభం.. ఏడాదిలో రెండంకెల రాబడి..?

ప్రస్తుత కాలంలో డబ్బును ఆదా చేయడం ఎంతో అవసరం. డబ్బును ఆదా చేస్తే మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో సైతం ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ ను అందుబాటులోకి తెస్తోంది. అలా కేంద్రం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన అద్భుతమైన స్కీమ్స్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో చేరిన వారు సులువుగా అదిరిపోయే రాబడిని పొందవచ్చు. పొదుపు చేయాలని భావించే వాళ్లకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 20, 2020 / 09:55 AM IST
    Follow us on

    ప్రస్తుత కాలంలో డబ్బును ఆదా చేయడం ఎంతో అవసరం. డబ్బును ఆదా చేస్తే మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో సైతం ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ ను అందుబాటులోకి తెస్తోంది. అలా కేంద్రం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన అద్భుతమైన స్కీమ్స్ లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో చేరిన వారు సులువుగా అదిరిపోయే రాబడిని పొందవచ్చు.

    పొదుపు చేయాలని భావించే వాళ్లకు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ తక్కువ శాతం వడ్డీని అందిస్తున్నాయి. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ ఏకంగా 12 శాతం రాబడి అందిస్తున్న నేపథ్యంలో ఈ స్కీమ్ ను బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ గా కూడా భావించవచ్చు. ఈ స్కీమ్ లో రిస్క్ చాలా తక్కువ ఉండటంతో ఎవరైనా ఈ స్కీమ్ ద్వారా పొదుపు చేసి సులభంగా అదిరిపోయే రాబడిని పొందవచ్చు.

    2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ సిస్టమ్ ను అమలులోకి తెచ్చింది. అయితే కేంద్రం కొత్త పెన్షన్ సిస్టమ్ ను అమలులోకి తెచ్చిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉండేది. అయితే కేంద్రం 2009 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ ఈ స్కీమ్ అందుబాటులో ఉండే విధంగా నిబంధనలలో మార్పులు చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ స్కీమ్ లో ఎవరైనా సులువుగా చేరవచ్చు.

    రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకున్న వాళ్లు ఈ స్కీమ్ లో చేరి ప్రయోజనం పొందవచ్చు. ఏకంగా 12 శాతం రాబడి వస్తూ ఉండటంతో ఇతర స్కీమ్ లతో పోలిస్తే ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పాలి. మరోవైపు హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్‌మెంట్ ఫండ్ ఏకంగా 13.43 శాతం రాబడి అందిస్తుండగా ఎల్‌ఐసీ పెన్షన్ ఫండ్ 12.49 శాతం రాబడిని, ఐసీఐసీఐ ప్రు పెన్షన్ ఫండ్ మేనేజ్‌మెంట్ 12.25 శాతం రాబడిని అందిస్తోంది.