బ్రిటన్ కరోనా ఎఫెక్ట్ : కర్ణాటకలోనూ నైట్ కర్ఫ్యూ

కర్ణాటక రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె. సుధాకర్ మాట్లాడుతూ బ్రిటన్ లో కొత్తగా వచ్చిన కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూ విధించామన్నారు. అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. ముఖ్యంగా యూకే నుంచి వచ్చిన వారికి కచ్చితంగా […]

Written By: Velishala Suresh, Updated On : December 23, 2020 1:45 pm
Follow us on

కర్ణాటక రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె. సుధాకర్ మాట్లాడుతూ బ్రిటన్ లో కొత్తగా వచ్చిన కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూ విధించామన్నారు. అలాగే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. ముఖ్యంగా యూకే నుంచి వచ్చిన వారికి కచ్చితంగా కరోనా టెస్టులు చేయిస్తున్నామన్నారు. ఇంగ్లాండ్ లోని కనుగొన్న ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారన్నారు.
కాగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది.