https://oktelugu.com/

స్టార్ హోటల్లో దాక్కున్న KGF రాకీ భాయ్ .. కారణం తెలిస్తే షాకింగే!

కెజిఎఫ్ స్టార్ యష్ ఎవరికీ కనిపించకుండా స్టార్ హోటల్ రూమ్ లో తలదాచుకున్నాడట. ఆంత పెద్ద స్టార్ ఇలా అజ్ఞాతంలోకి వెళ్లవలసిన అవసరం ఏమిటని అందరికీ సందేహం కలగవచ్చు. ఐతే యష్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఆ మహమ్మారికి బయపడ్డారట. అందుకే ఆయన కుటుంబాన్ని కూడా కలవకుండా హోటల్ గదికే పరిమితం అయ్యారట. విషయంలోకి వెళితే… కెజిఫ్ 2 షూటింగ్ లో పాల్గొన్న యష్, వందల మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో కలిసి […]

Written By:
  • admin
  • , Updated On : December 23, 2020 / 01:47 PM IST
    Follow us on


    కెజిఎఫ్ స్టార్ యష్ ఎవరికీ కనిపించకుండా స్టార్ హోటల్ రూమ్ లో తలదాచుకున్నాడట. ఆంత పెద్ద స్టార్ ఇలా అజ్ఞాతంలోకి వెళ్లవలసిన అవసరం ఏమిటని అందరికీ సందేహం కలగవచ్చు. ఐతే యష్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఆ మహమ్మారికి బయపడ్డారట. అందుకే ఆయన కుటుంబాన్ని కూడా కలవకుండా హోటల్ గదికే పరిమితం అయ్యారట. విషయంలోకి వెళితే… కెజిఫ్ 2 షూటింగ్ లో పాల్గొన్న యష్, వందల మంది జూనియర్ ఆర్టిస్ట్స్ తో కలిసి పనిచేశారట. పాత్ర రీత్యా వంటి నిండా దుమ్ము, డమ్మీ రక్తం… ముఖం, వంటికి మేకప్ చేసుకొని షూటింగ్ లో పాల్గొన్నారట. కీలకమైన క్లైమాక్స్ ఫైట్ సన్నివేశాలలో కోవిడ్ నిబంధనలు పాటించడం కుదరలేదట.

    Also Read: జబర్ధస్త్ లవ్.. వర్ష ప్రేమ ఫలిస్తుందా?

    దీనితో షూటింగ్ ముగియగానే యష్ ఓ సెవెన్ స్టార్ హోటల్ లో పర్మినెంట్ సూట్ రూమ్ బుక్ చేసుకున్నారట. ఆ తరువాత వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారట. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఆయన కుటుంబంతో పాటు ఎవరినీ కలవలేదట. ఒంటరిగా ఆ హోటల్ గదిలో ఉండిపోయారట యష్. కాగా యష్ కి కోవిడ్ పరీక్షలలో నెగిటివ్ రావడంతో అప్పుడు కుటుంబాన్ని కలిశాడని సమాచారం. అలాగే ఈ షూటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తనకు లాగే వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుందని, అందుకే కోవిడ్ పరీక్షల తరువాతే కుటుంబ సభ్యులను కలవాలని యష్ చెప్పారట.

    Also Read: 2020లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీరే !

    కాగా కెజిఫ్ 2 షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం అందుతుండగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయట. జనవరి 8న కెజిఫ్ 2 టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి భాగాన్ని మించి కెజిఎఫ్ 2 తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరా రోల్ చేస్తున్నారు. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కెజిఎఫ్ 2 లో నటించడం విశేషం. కోవిడ్ కారణంగా ఇప్పటికే విడుదల ఆలస్యం కాగా, వీలైనంత త్వరగా థియేటర్స్ లోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్