ఈ సంవత్సరం మధురానుభూతులు కన్నా చేదు జ్ఞాపకాలనే అందరికి ఎక్కువగా మిగిల్చింది. 2020 ఓక పీడకలగా మరిచిపోవాలని అనుకున్నా మరువలేం,ఎందుకంటే అంతలా ఇబ్బందులకు గురయ్యాము. కరోనా వల్ల జీవితాలు తలక్రిందులవటమేకాకుండా అనేక మందిని పొట్టన పెట్టుకుంది ఇంకా పలు కారణాలతో పలువురు ప్రముఖులు కూడా మరణించారు.మనకి ఎంతో కొంత వినోదం పంచి, అలానే జీవితం మీద ప్రభావం చూపించి తిరిగిరాని లోకానికి వెళ్ళిన ప్రముఖులను మరొక్కసారి గుర్తు చేసుకుని నివాళులు అర్పిద్దాం.
Also Read: జబర్ధస్త్ లవ్.. వర్ష ప్రేమ ఫలిస్తుందా?
1. ఇర్ఫాన్ ఖాన్
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ హిందీ సినిమాతో పాటు హాలీవుడ్ చిత్రాలలో కూడా పనిచేశారు. మన దేశ ఉత్తమ నటులలో ఒకరిగా పేరు పొందాడు. 2011 లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది.మార్చి 2018 లో, న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. UK లో ఒక సంవత్సరం పాటు ట్రీట్మెంట్ తీసుకుని 2019 ఫిబ్రవరిలో తిరిగి వచ్చారు. వ్యాధి తిరగ పెట్టినందువల్ల ఏప్రిల్ 28, 2020 న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరాడు, మరుసటి రోజునే మరణించాడు. ఆయన మరణ వార్త దేశంలో సినీ అభిమానులను విషాదంలో ముంచింది.
2. రిషి కపూర్
నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతితో విషాదంలో మునిగి ఉన్న భారత దేశం ఏప్రిల్ 30న బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ మరణ వార్త వినాల్సి వచ్చింది. రిషి కపూర్ కి 2018 లో లుకేమియా ఉన్నట్లు నిర్ధారణ అయి చికిత్స కోసం న్యూయార్క్ నగరానికి వెళ్లారు. ఒక సంవత్సర కాలం చికిత్స తీసుకుని 26 సెప్టెంబర్ 2019 న భారతదేశానికి తిరిగి వచ్చాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నందున ఆయనను 29 ఏప్రిల్ 2020 ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కానీ ఆయన 30 ఏప్రిల్ 2020 న లుకేమియాతో మరణించాడు.రిషి కపూర్ తోటి నటి నీతు సింగ్ ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కుమారుడు-నటుడు రణబీర్ కపూర్, మరియు కుమార్తె-రిద్దిమా కపూర్ సాహ్ని.
3. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
ఈ సంవత్సరం అత్యంత విషాదం మిగిల్చిన మరణ వార్తలలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య మొదటి స్థానంలో ఉంటుంది. ఈ యువ నటుడు బాలీవుడ్ లో నటనతో , క్యారెక్టర్ తో అనేక మంది అభిమానులని సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సమయంలో నాటకీయంగా జూన్ 14, 2020 న తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడినాడు. ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన మరణం వెనుక అనేక రకాలైన కారణాలు ఉన్నట్లుగా బయటకి వినిపించాయి. ఎన్‌సిబి ఈ కేసు మీద దర్యాప్తు చేస్తుంది.
Also Read: టీజర్ టాక్:ప్రేమ కోసం పరితపించే ఆది ‘శశి’
4. సరోజ్ ఖాన్
సరోజ్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా పాపులర్ అయ్యారు. ఆమె బొంబాయిలో జన్మించింది. బాలీవుడ్లో మొదటి మహిళా కొరియోగ్రాఫర్ గా ప్రసిద్ది చెందింది. ఆమె నలభై ఏళ్ళలో, 3000 పాటలకు పైగా కొరియోగ్రఫీ చేసింది.సరోజ్ ఖాన్ ముంబైలోని బాంద్రాలోని గురు నానక్ ఆసుపత్రిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా 2020 జూలై 3 న గుండెపోటుతో మరణించారు.
5. జయప్రకాష్ రెడ్డి
రంగస్థల నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన జయప్రకాశ్ రెడ్డి 2020 సెప్టెంబర్ 8న గుండెపోటుతో మరణించారు. రాయలసీమ మాండలీకంతో విలనిజం పండిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న ఆయన.. ‘ప్రేమించుకుందాం రా’, ‘సమరసింహారెడ్డి’, ‘జయం మనదేరా’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘టెంపర్’ తదితర సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించారు.
6. ఎస్పీ బాలసుబ్రమణ్యం
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 2020 సెప్టెంబర్ 25న కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన దాదాపు రెండు నెలల పాటు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. నాలుగు దశాబ్దాల పాటు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సాధించారు. పలు చిత్రాల్లోనూ ఆయన నటించారు.ఆయన మరణ వార్త అభిమానులని తీవ్ర ఆవేదనకు గురి చేసింది .
Also Read: ఓ ఇంటివాడైన చాహల్
7. శ్రావణి కొండపల్లి
తెలుగు టీవీ నటి శ్రావణి కొండపల్లి,సెప్టెంబర్ 8 న హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. టీవీ నటుడు అంబతి దేవరాజా రెడ్డి, మంగముత్తుల సాయి కృష్ణారెడ్డి, టాలీవుడ్ నిర్మాత గుమ్మకొండ అశోక్ రెడ్డి వేధింపుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. మనసు మమత, మౌనరాగం వంటి ప్రముఖ టీవీ సీరియళ్లలో శ్రావణి పాత్రలు పోషించటం ద్వారా తెలుగు టీవీ ప్రేక్షకులకి ఆమె సుపరిచితం.
8. చిరంజీవి సర్జా
కన్నడ నటుడు చిరంజీవి సర్జా 39 సంవత్సరాల వయస్సులోనే గుండెపోటుతో జూన్ 7 న బెంగళూరులో కన్నుమూశారు.ఆయన నటుడు ధ్రువ సర్జా సోదరుడు మరియు తమిళ్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు. పదేళ్ల కెరీర్‌లో 20 కి పైగా సినిమాల్లో నటించారు. చివరిసారిగా శివర్జున సినిమాలో కనిపించాడు. ఈయన మరణం కన్నడ రాష్ట్రాన్ని శోక సంద్రంలో ముంచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్