
బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ అనుహ్యంగా లీడ్లో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 125 స్థానాల్లో లీడ్లో ఉంది. 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 122 స్థానాల్లో విజయం సాధించాలి. అటు బీజేపికి మిత్ర పక్షమైన ఎల్జీపీ 6 స్థానాల్లో లీడింగ్లో ఉంది. దీంతో ఎల్జేపీ సాయంతో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంలో ఉందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. పరిస్థతిని గమనించిన కాంగ్రెస్ గెలిచే ఎమ్మల్యేలను కాపాడుకునే పనిలో ఉంది. ఆర్జేడీ కూటమిలో ఉన్న కాంగ్రెస్ 30 లోపు స్థానాల్లోనే లీడింగ్లో ఉంది. ఎన్డీయే కూటమిలో బీజేపీదే పై చేయి ఉంది. శత్రుఘ్నసిన్హా కుమారుడు ఓటమి బాటలో వెళ్తున్నారు. తాజాగా 125 స్థానాల్లో ఎన్డీయే కూటమి లీడ్ లో ఉండగా, మరో 112 స్థానాల్లో మహాకూటమి ఆధిక్యతో ఉంది. ఇక ఎల్ జేపీ 6, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.