రోహిత్ కం బ్యాక్.. విమర్శలతో ఇండియన్ టీంలోకి తీసుకున్న బీసీసీఐ

ఐపీఎల్‌ 2020 సీజన్‌‌‌ ముగిసిన వెంటనే జంబో జట్టు‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్‌‌ తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్‌‌ ఆడనుంది. సుమారు మూడు నెలలపాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్‌‌తో పాటు నాలుగు మ్యాచ్‌‌ల టెస్టు సిరీస్‌‌లో కూడా పోటీ పడనుంది. ఓ డే నైట్‌‌ మ్యాచ్‌‌ కూడా ఉండే టెస్టు సిరీస్‌‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. Also Read: సన్ రైజర్స్ ఔట్: ఫస్ట్‌ […]

Written By: NARESH, Updated On : November 10, 2020 3:36 pm
Follow us on

ఐపీఎల్‌ 2020 సీజన్‌‌‌ ముగిసిన వెంటనే జంబో జట్టు‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్‌‌ తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్‌‌ ఆడనుంది. సుమారు మూడు నెలలపాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్‌‌తో పాటు నాలుగు మ్యాచ్‌‌ల టెస్టు సిరీస్‌‌లో కూడా పోటీ పడనుంది. ఓ డే నైట్‌‌ మ్యాచ్‌‌ కూడా ఉండే టెస్టు సిరీస్‌‌ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Also Read: సన్ రైజర్స్ ఔట్: ఫస్ట్‌ టైమ్‌ ఫైనల్‌ చేరిన ఢిల్లీ కేపిటల్స్‌

ఆస్ట్రేలియా టూర్‌ కోసం ఇప్పటికే జట్టు సభ్యులను టీమిండియా సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. అయితే.. ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో టీమ్ సెలెక్షన్‌పై తీవ్ర దుమారం రేగడంతో మరోసారి సమావేశమైన సునీల్ జోషీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. టీమిండియా ఫిజియో తాజా రిపోర్టులతో మార్పులు చేసింది. ఈ అప్‌డేటెడ్ జట్ల వివరాలను బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

గాయం నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20, వన్డేలకు విశ్రాంతినిచ్చి టెస్ట్ టీమ్‌లో అవకాశం కల్పించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తుందని, పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాలనే ఉద్దేశంతోనే వన్డే, టీ20లకు విశ్రాంతినిచ్చిందని బోర్డు స్పష్టం చేసింది. చికిత్స పొందుతున్న స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ కోలుకుంటే టెస్ట్ టీమ్‌లోకి తీసుకుంటామని తెలిపింది. భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న వరుణ్ చక్రవర్తిని టీ20 జట్టు నుంచి తప్పించిన సెలెక్షన్ కమిటీ.. అతని స్థానంలో యువ పేసర్ టీ నటరాజన్‌కు అవకాశం కల్పించింది. నట్టూ ఇప్పటికే ఈ టూర్ అదనపు బౌలర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. వన్డే జట్టులో అదనపు కీప‌ర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసింది.

పెటర్నీటి లీవ్‌ కోరిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ సెలవులు మంజూరు చేసింది. తొలి టెస్ట్ అనంతరం విరాట్ భారత్ రానుండటంతో మిగతా మూడు టెస్ట్‌లకు దూరం కానున్నాడు. కమలేష్ నాగర్ కోటీ బౌలింగ్ వర్క్ లోడ్‌ను బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని, వృద్దిమాన్ సాహా గాయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది.

Also Read: కోహ్లి ఉన్నన్ని రోజులు బెంగళూరుకు కప్‌ రాదంట

సెలక్షన్‌ కమిటీ ప్రకటించిన టీ 20 జట్టు ఇలా ఉంది. విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్(కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుంధర్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, నటరాజన్

భారత వన్డే టీమ్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(కీపర్, వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవ్‌దీప్ సైనీ, శార్దుల్ ఠాకుర్, సంజూ శాంసన్

టెస్టు టీమ్‌: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే, హనుమ విహారీ, శుభ్‌మన్ గిల్, వృద్ధీమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్(కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, రోహిత్ శర్మ.