
ఈ ఏడాది నవంబర్ 14వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు బాణాసంచాలను నిషేధిస్తున్నట్లు అనుమతులు జారీ చేశాయి. వాతావరణ కాలుష్యం పట్ల, ప్రస్తుతమున్న కరోనా నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వాలు తెలిపాయి. కానీ కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ కాల్చడానికి అనుమతులు తెలిపాయి. మరికొన్ని రాష్ట్రాలలో టపాకాయలను పేల్చేడానికి కొంత సమయం కేటాయించి అనుమతులను జారీ చేసింది.
Also Read: ఈ దీపం 24 గంటలు వెలుగుతుంది.. ఎలానో తెలుసా?
ఈ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో కాల్చే బాణాసంచ విషయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ నిబంధనలను విధించినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా, నగరంలో శాంతిభద్రతల ఉల్లంఘనకు కారణం కాకుండా, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఆయన వెల్లడించారు.
దీపావళి పండుగను జరుపుకోవడానికి ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ షరతులు వర్తిస్తాయని అంజనీ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా దీపావళి రోజున టపాకాయలను కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చడానికి అనుమతిస్తామని తెలియజేశారు. కుటుంబ సభ్యులు వారి పిల్లలకు జాగ్రత్తలు తెలియజేస్తూ ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా ఈ పండుగను నిర్వహించుకోవాలన్నారు.
Also Read: ఐదు రోజుల దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా?
అంతేకాకుండా టపాకాయలను కాలుష్య మండలి నిర్దేశించిన శబ్దం వచ్చే టపాకాయలను మాత్రమే కాల్చాలని, ఎక్కువ శబ్దం వచ్చే టపాకాయలు కూడా అనుమతి లేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతే కాకుండా జన సందోహం ఉన్న ప్రాంతాలలో, పబ్లిక్ ఏరియాలలో బాణాసంచాలకు అనుమతి లేదని తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ, సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరు ఈ పండుగను జరుపుకోవాలని పోలీస్ శాఖ తెలియజేసింది. అంతేకాకుండా ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై హైదరాబాద్ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.