కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణంపై ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఇతరులకు సహాయపడడం, దయా హ్రుదయం ఆయనలోని గొప్ప గుణాలన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. క్లిష్ట సమమంలో పార్టీకి అండగా ఉన్నారన్నారు. మరోవైపు ప్రియాంకగాంధీ సైతం అహ్మద్ పటేల్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.ఏ సలహా కోసం వెళ్లినా సరైన మార్గం తెలిపారన్నారు. ఆయన మ్రుతి పార్టీకి తీరని లోటన్నారు. రాజీవ్ హయాం నుంచి రాహుల్ గాంధీ వరకు అహ్మద్ పటేల్కు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు.