తుఫాన్ ఎఫెక్ట్: రెండు రోజులు సెలవులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా లో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు నేడు, రేపు  సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద సంభవించే ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీక్రుతం కావడంతో చెన్నై, ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే […]

Written By: Suresh, Updated On : November 25, 2020 11:49 am
Follow us on

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా లో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు నేడు, రేపు  సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద సంభవించే ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం కేంద్రీక్రుతం కావడంతో చెన్నై, ఏపీలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయానికి గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో 62 కిలోమీర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. అందువల్ల సముద్ర తీర ప్రాంతాల మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.