
పాకిస్థాన్‌లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడ్ని గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీస్) అరెస్ట్ చేసింది. అబ్దుల్ మజీద్ కుట్టిని జార్జిండ్‌లోని జంషెడ్‌పూర్‌లో శనివారం అదుపులోకి తీసుకున్నది. 1997లో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా గుజరాత్, మహారాష్ట్రలో బాంబు పేలుళ్లు జరిపేందుకు అతడు ప్రయత్నించాడు. పాకిస్థాన్ ఏజెన్సీ ఆదేశాల మేరకు దావూద్ ఇబ్రహీం పంపిన పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో నిందితుడైన అబ్దుల్ మజీద్ కుట్టిని అరెస్ట్ చేశారు.