https://oktelugu.com/

బ్రేకింగ్: రజినీకాంత్ గురించి కీలక అప్ డేట్

బీపీ పెరగడంతో ఆస్పత్రి పాలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం గురించి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆపోలో ఆస్పత్రిలో చేరిన రజినీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. Also Read: జమిలిపై బీజేపీ దూకుడు వారం రోజుల పాటు రజినీకాంత్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని.. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి బయటి కార్యక్రమాలకు రజినీకాంత్ హాజరు కావద్దని సూచించినట్టు తెలిసింది. అదే సమయంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 27, 2020 / 04:53 PM IST
    Follow us on

    బీపీ పెరగడంతో ఆస్పత్రి పాలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం గురించి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆపోలో ఆస్పత్రిలో చేరిన రజినీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

    Also Read: జమిలిపై బీజేపీ దూకుడు

    వారం రోజుల పాటు రజినీకాంత్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని.. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి బయటి కార్యక్రమాలకు రజినీకాంత్ హాజరు కావద్దని సూచించినట్టు తెలిసింది. అదే సమయంలో ఒత్తిడి తగ్గేందుకు పలు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచించినట్టు తెలిసింది.

    గతంలో మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న రజినీకాంత్ ప్రస్తుతం కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో రజినీకాంత్ వెంటనే చెన్నై వెళ్లిపోయారు.

    Also Read: జగిత్యాలలో కి‘లేడీ’

    గత 10 రోజులుగా ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజనీ ఏకంగా 14 గంటల పాటు పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటున్నారు. రజినీకాంత్ వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. కాగా రజనీ ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

    డిసెంబర్ 31న పార్టీ ప్రకటన నేపథ్యంలో రజినీ అస్వస్థతతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వద్దకు అభిమానులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో అపోలో ఆస్పత్రి వద్ద భద్రత పెంచారు. పేషేంట్లను, అటెండర్లను మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్