ఐసీసీ ర్యాంకును నిలుపుకున్న కోహ్లి

పింక్ బాల్ టెస్టు సిరీస్ లో భాగంగా ఆడిలైడ్ టెస్టును భారత్ కోల్పోయింది. అత్యల్ప స్కోరుతో ఆల్ ఔట్ అయింది. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం టెస్ట్ బ్యాట్సమెన్లలో రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంక్ లను ఆదివారం ప్రకటించింది.  ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 901 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, 888 పాయింట్లతో విరాట్ కోహ్లి రెండో స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచుల్లో భాగంగా మొదటి […]

Written By: Suresh, Updated On : December 20, 2020 4:03 pm
Follow us on

పింక్ బాల్ టెస్టు సిరీస్ లో భాగంగా ఆడిలైడ్ టెస్టును భారత్ కోల్పోయింది. అత్యల్ప స్కోరుతో ఆల్ ఔట్ అయింది. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం టెస్ట్ బ్యాట్సమెన్లలో రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంక్ లను ఆదివారం ప్రకటించింది.  ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 901 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, 888 పాయింట్లతో విరాట్ కోహ్లి రెండో స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచుల్లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లి 74 పరుగులు చేశారు. దీంతో భారత్ 53 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 4 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్ లో 2 పాయింట్లు సాధించాడు. దీంతో మొదటి స్థానానికి కేవలం 21 పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకిగ్ లో అశ్విన్, బుమ్రాను అధిగమించాడు. అశ్విన్ 9వ స్థానానాకి, బుమ్రా 10 స్థానానికి మారాడు. వీరిద్దరు అంతకుముందు 10, 9 స్థానాల్లో ఉండేవారు.