జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్-బీజేపీ ‘వార్’ ఇంకా కొనసాగుతుందా?

ముందస్తు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా జరిగాయి. గ్రేటర్లో టీఆర్ఎస్ 56సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే.. బీజేపీ 48సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఎంఐఎంకు 44సీట్లు రావడంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందనే ఆసక్తి గ్రేటర్ వాసుల్లో నెలకొంది. Also Read: తెలంగాణలో బీజేపీకి తొలి ఎదురుదెబ్బ..! ప్రస్తుత పాలకవర్గానికి మరో రెండునెలల గడువు ఉంది. దీంతో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు.. పాత కార్పొరేటర్ల మధ్య తరుచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే […]

Written By: Neelambaram, Updated On : December 20, 2020 4:53 pm
Follow us on

ముందస్తు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా జరిగాయి. గ్రేటర్లో టీఆర్ఎస్ 56సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే.. బీజేపీ 48సీట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఎంఐఎంకు 44సీట్లు రావడంతో మేయర్ పీఠం ఎవరికీ దక్కుతుందనే ఆసక్తి గ్రేటర్ వాసుల్లో నెలకొంది.

Also Read: తెలంగాణలో బీజేపీకి తొలి ఎదురుదెబ్బ..!

ప్రస్తుత పాలకవర్గానికి మరో రెండునెలల గడువు ఉంది. దీంతో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు.. పాత కార్పొరేటర్ల మధ్య తరుచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడై రెండు వారాలు గడిచిపోతుప్పటికీ బీజేపీ.. టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వార్ ఇంకా కొనసాగుతున్నట్లే కన్పిస్తోంది.

గ్రేటర్లో బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు దాడులు ప్రతిదాడులు కొనసాగుతాయి. దీంతో గ్రేటర్లో ఆందోళనల పరిస్థితులు భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం వినాయకనగర్ లో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు చైతన్యరెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడులు చేశారు.

Also Read: కేసీఆర్‌‌కు ఆ సలహాలు ఎవరిస్తున్నారు.. ఎందుకు నమ్ముతున్నారు..?

ఈ ఘటనలో ఆమెకు గాయాలుకాగా.. ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసమైంది. దీంతో ఆమె తన ఇంటిపై బీజేపీ నేతలే దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి వాహనంపై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేయడం ఆందోళన రేపుతోంది.

ఎన్నికల తర్వాత టీఆర్ఎస్..బీజేపీ శ్రేణుల మధ్య ఇప్పటికే ఐదుసార్లు ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో డివిజన్లల్లో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సైతం ఆందోళనలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్