కరోనాతో సీపీఎం నాయకుడి మృతి 

    కరోనా మహమ్మారిని కట్టడి చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలల్లో నమోదవుతుంటే కేరళలో జీరోస్థాయికి వచ్చింది. మరణాల సంఖ్య కూడా తక్కువగానే నమోదైంది. అయితే ఇటీవల కేరళలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఊహించని విధంగా కేసులు నమోదవుతుండడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా సీపీఎం యువనాయకుడు పీ.బిజు కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఈ వైరస్ బారిన పడ్డ బిజు తిరువనంతపురం […]

Written By: Suresh, Updated On : November 4, 2020 10:23 am
Follow us on

 

 

కరోనా మహమ్మారిని కట్టడి చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలల్లో నమోదవుతుంటే కేరళలో జీరోస్థాయికి వచ్చింది. మరణాల సంఖ్య కూడా తక్కువగానే నమోదైంది. అయితే ఇటీవల కేరళలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఊహించని విధంగా కేసులు నమోదవుతుండడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా సీపీఎం యువనాయకుడు పీ.బిజు కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఈ వైరస్ బారిన పడ్డ బిజు తిరువనంతపురం మెడికల్ కళాశాలలో చికత్స పొందుతున్నారు. తాజాగా ఆయనకు గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆసుపత్రి వర్గాలె తెలిపాయి. బిజు ప్రస్తతుం యువజన సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నారు. గతంలో ఎస్ఎఫ్ఐ రాష్ర్ట కార్యదర్శిగా పనిచేశారు.