దెబ్బకు ప్లేఆఫ్స్ కు.. డూ ఆర్‌‌ డై మ్యాచ్‌లో సన్‌‘రైజ్‌’

ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ రైజ్‌ అయింది. బౌలింగ్‌.. బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. పటిష్ట ముంబైని కట్టడి చేసిన ఆరేంజ్‌ ఆర్మీ.. టార్గెట్‌ ఛేజింగ్‌లోనూ విరుచుకుపడింది. వికెట్‌ కూడా నష్టపోకుండా ఇద్దరు ఓపెనర్లే టార్గెట్‌ను ఛేదించి సవాల్‌ విసిరారు. దీంతో నాకౌట్‌ బెర్త్‌పై భారీ ఆశలు పెట్టుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు నిరాశే మిగిలింది. సేమ్‌ పాయింట్స్‌ ఉన్నా నెట్‌ రన్‌రేట్‌లో వెనుకబడిన మోర్గాన్‌సేన ఇంటిముఖం పట్టక తప్పలేదు. ఈ విజయంతో హైదరాబాద్‌ […]

Written By: NARESH, Updated On : November 4, 2020 1:01 pm
Follow us on


ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ రైజ్‌ అయింది. బౌలింగ్‌.. బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. పటిష్ట ముంబైని కట్టడి చేసిన ఆరేంజ్‌ ఆర్మీ.. టార్గెట్‌ ఛేజింగ్‌లోనూ విరుచుకుపడింది. వికెట్‌ కూడా నష్టపోకుండా ఇద్దరు ఓపెనర్లే టార్గెట్‌ను ఛేదించి సవాల్‌ విసిరారు. దీంతో నాకౌట్‌ బెర్త్‌పై భారీ ఆశలు పెట్టుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు నిరాశే మిగిలింది. సేమ్‌ పాయింట్స్‌ ఉన్నా నెట్‌ రన్‌రేట్‌లో వెనుకబడిన మోర్గాన్‌సేన ఇంటిముఖం పట్టక తప్పలేదు. ఈ విజయంతో హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో థర్డ్‌ ప్లేస్‌ కైవసం చేసుకుంది.

Also Read: పీవీ సింధూ రిటర్ మెంట్.. ట్విస్ట్ ఇచ్చిందిలా!

ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆరేంజ్‌ ఆర్మీ.. ప్రత్యర్థి అయిన ముంబయికి బ్యాటింగ్‌ ఇచ్చింది. నిర్ణీత 20 ఓవ‌ర్లలో 9 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసిన ముంబయి, హైద‌రాబాద్‌కు 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇచ్చింది. బుమ్రా లేని ముంబయి బౌలింగ్ మ‌రింత బ‌ల‌హీనంగా మారిపోవ‌డంతో.. ఏ ద‌శ‌లోనూ హైద‌రాబాద్ త‌డ‌బ‌డ‌లేదు.150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మ‌రో 17 బంతులు మిగిలి ఉండ‌గానే.. వికెట్ కోల్పోకుండా ఛేదించింది. వార్నర్ 58 బంతుల్లో 85 ప‌రుగులు, సాహా 45 బంతుల్లో 58 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. వికెట్ ప‌డకుండా త‌మ జ‌ట్టుని ప్లే ఆఫ్‌కి చేర్చారు. ముంబయిపై ప‌ది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకోవ‌డం హైద‌రాబాద్‌కు ఇదే మొదటిసారి.

టార్గెట్‌ ఛేజింగ్‌లో హైదరాబాద్‌ ఓపెనర్లు వార్నర్‌‌, సాహా పోటీపడ్డారు. ఒకర్ని మించి మరొకరు బౌండరీలతో హోరెత్తించారు. దీంతో ముంబయి బౌలర్లు తేలిపోయారు. సెకండ్‌ ఓవర్‌‌లో సాహా 6,4, తర్వాత మరో రెండు ఫోర్లు బాదగా.. నాలుగు ఓవర్‌‌లో వార్నర్‌‌ హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించాడు. ఐదో ఓవర్‌‌లో చెరో ఫోర్‌‌ కొట్టడంతో పవర్‌‌ప్లేలో హైదరాబాద్‌ 56 రన్స్‌ సాధించింది. ఫీల్డింగ్‌ సడలించాక కూడా వార్నర్‌‌, సాహా ఆటలో మార్పు కనిపించలేదు. స్పిన్నర్లు చహర్‌‌, క్రునాల్‌ ఎంటర్‌‌ అయినా కట్టడి చేయలేకపోయారు. చివరగా వార్నర్‌‌ రెండు ఫోర్లతో మ్యాచ్‌ను ముగించేశాడు.

Also Read: రానా, కోహ్లీ, ప్రకాష్ రాజ్ కు షాక్.. హైకోర్టు నోటీసులు

కాగా.. ఈ మ్యాచ్‌తో ప్లే ఆఫ్ లెక్కలు తేలిపోయాయి. తొలి మ్యాచ్‌లో ముంబయి, ఢిల్లీ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కి చేరుకుంటుంది. రెండో మ్యాచ్‌లో హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు ఢీ కొట్టనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన జ‌ట్టుతో ఆడుతుంది. అందులో గెలిస్తే.. ఫైన‌ల్‌కు చేరుతుంది. ఆ తర్వాత నవంబర్‌‌ 10న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.