మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ ఓ మహిళా మంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.’డబ్రా’ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రస్తుతం మంత్రిగా విధులు నిర్వహిస్తున్న ఇమూర్తి దేవీని ‘ఐటమ్’ అని అనడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘ఇక్కడి నుంచి సురేశ్ రాజే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈయన సాదాసీదా వ్యక్తి.. ఆమె లాగా కాదు. ఆమె ఒక ఐటమ్” అంటూ కమల్‌నాథ్ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ మాట్లాడుతూ ఓ సీనియర్ రాజకీయ వేత్తగా ఉన్న కమల్‌నాథ్ ఇలా మహిళా మంత్రిని అగౌరవపరిచేలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ఇక ఇమూర్తి దేవి ఈ విషయంపై సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానన్నారు.