https://oktelugu.com/

మూడు సూపర్ ఓవర్లు.. ఐపీఎల్ నరాలు తెంపేసింది..

ఆదివారం.. అందరికీ సెలవుదినం.. పైగా ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు. టీవీలకు అతుక్కుపోయిన జనాలకు క్రికెట్ చరిత్రలోనే కనివీనీ ఎరుగని మ్యాచ్ లను చూపించింది ఐపీఎల్. ఏమన్నా మ్యాచ్ ల అవీ.. ఐపీఎల్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత ఉత్కంఠగా.. ఊపిరి బిగబట్టేలా.. నరాలు తెగేలా సాగిన రెండు వేర్వేరు మ్యాచుల్లో చివరకు సూపర్ ఓవర్ వరకు చేరి కింగ్స్ లెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ అతికష్టం మీద విజయం సాధించాయి. ఇక చివరి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2020 / 10:28 AM IST
    Follow us on

    ఆదివారం.. అందరికీ సెలవుదినం.. పైగా ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు. టీవీలకు అతుక్కుపోయిన జనాలకు క్రికెట్ చరిత్రలోనే కనివీనీ ఎరుగని మ్యాచ్ లను చూపించింది ఐపీఎల్. ఏమన్నా మ్యాచ్ ల అవీ.. ఐపీఎల్ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంత ఉత్కంఠగా.. ఊపిరి బిగబట్టేలా.. నరాలు తెగేలా సాగిన రెండు వేర్వేరు మ్యాచుల్లో చివరకు సూపర్ ఓవర్ వరకు చేరి కింగ్స్ లెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ అతికష్టం మీద విజయం సాధించాయి. ఇక చివరి బంతి వరకూ పోరాడి ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆకట్టుకున్నాయి..

    సండే నాడు తొలుత హైదరాబాద్-కోల్ కతా మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. చివరికి టై కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఇందులో కోల్ కతా బౌలర్ ఫెర్య్గూసన్ ధాటికి సన్ రైజర్స్ సూపర్ ఓవర్ లో 2 పరుగులు మాత్రమే చేసింది. ఆ ఈజీ లక్ష్యాన్ని కోల్ కతా కూడా అతి కష్టం మీద ఛేదించి విజయం సాధించింది. చివరి బంతి వరకు సన్ రైజర్స్ ఓటమిని ఒప్పుకోకుండా పోరాడిన తీరు అభిమానులను అలరించింది.

    ఇక ముంబై ఇండియన్స్-కింగ్స్ లెవన్ పంజాబ్ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే హైలెట్. తొలి 20 ఓవర్ల మ్యాచ్ టై అయ్యింది. ఆ తరువాత తొలి సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. దీంతో ఉత్కంఠ రేకెత్తింది. రెండో సూపర్ ఓవర్ ఎలా నిర్వహిస్తారు? నిబంధనలు ఏమిటన్నది కూడా ఆటగాళ్లు, కామంటేటర్స్ కు తెలియదు. ఇంతవరకు ఇలాంటి పరిస్తితి ప్రపంచ క్రికెట్ లో, ఐపీఎల్ లో ఎదురు కాలేదు.

    దీంతో ప్రేక్షకులు, ఆటగాళ్లు ఊపిరి బిగబట్టి చూశారు. ఫస్ట్ సూపర్ ఓవర్ లో ఆడిన ఆటగాళ్లు రెండో సూపర్ ఓవర్ లో ఆడలేదు. చివరకు ముంబై రెండో సూపర్ ఓవర్ లో ముంబై 11 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్ గేల్ , మయాంక్ అగర్వాల్ సిక్స్ లు, ఫోర్లు కొట్టడంతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కింగ్స్ 11 పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకు పోరాడి జట్టును నడిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి.

    మొత్తం సండే ఫండే పంచింది. మొదటి మ్యాచ్ లో ఒక సూపర్ ఓవర్.. రెండో మ్యాచ్ లో ఏకంగా రెండు సూపర్ ఓవర్లు జరగడం.. చివరకు బాగా పోరాడిన కోల్ కతా, పంజాబ్ లు విజయం సాధించడం విశేషం. మొత్తం ఈ మ్యాచ్ లు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఐపీఎల్ మజాను పంచాయి. ఇవి కదా మ్యాచ్ లంటే అంటూ అభిమానులు సంబరపడ్డారు. కరోనా లాక్ డౌన్ తో ఎంటర్ టైన్ మెంట్ లేక నిరాశలో ఉన్న అభిమానులకు దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ బాగా రంజింప చేస్తోంది.