ఫైర్‌‌బ్రాండ్లను పక్కనపెట్టినట్లేనా..?

ఏ రాజకీయ పార్టీ మీద అయినా.. ఆ పార్టీ నాయకుడి మీద అయినా ప్రతిపక్షం లేదా అధికార పక్షం నుంచి విమర్శలు వచ్చాయంటే వాటిని దీటుగా బదులిచ్చే నేతలు కూడా ఉండాలి. ఈ విషయంలో ఏపీలోని అధికార పక్షం మెరుగ్గానే ఉంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అదే స్థాయిలో బదులిచ్చే నేతలు ఉన్నారు. కానీ.. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో ఫైర్‌‌బ్రాండ్లు ఎవరూ కనిపించడం లేదు. టీడీపీలో మొన్నటి దెందులూరు మాజీ […]

Written By: NARESH, Updated On : October 19, 2020 4:30 pm
Follow us on

ఏ రాజకీయ పార్టీ మీద అయినా.. ఆ పార్టీ నాయకుడి మీద అయినా ప్రతిపక్షం లేదా అధికార పక్షం నుంచి విమర్శలు వచ్చాయంటే వాటిని దీటుగా బదులిచ్చే నేతలు కూడా ఉండాలి. ఈ విషయంలో ఏపీలోని అధికార పక్షం మెరుగ్గానే ఉంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అదే స్థాయిలో బదులిచ్చే నేతలు ఉన్నారు. కానీ.. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో ఫైర్‌‌బ్రాండ్లు ఎవరూ కనిపించడం లేదు. టీడీపీలో మొన్నటి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌, అనంత‌పురం మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి, విజ‌య‌వాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వంటివారు ఫైర్ బ్రాండ్లుగా ఉన్నారు.

Also Read: జగన్‌ కేబినెట్‌ నుంచి కొందరు ఇన్‌.. మరికొందరు ఔట్‌..?

వీరితోపాటు.. ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న, వైవీబీ రాజేంద్రప్రసాద్‌, బీటెక్ ర‌వి, మ‌హిళా నేత‌ల్లో పంచుమ‌ర్తి అనురాధ‌, గిడ్డి ఈశ్వరి వంటివారు ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు పొందారు. వీరి కారణంగా పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. నిజానికి ఇలా వ్యవ‌హ‌రించే ఫైర్ బ్రాండ్లకు పార్టీల్లో గుర్తింపు ల‌భించ‌డం ఖాయ‌మ‌నే అందరూ అనుకుంటుంటారు.

మొన్నటివరకు కూడా తమ అధినేత చంద్రబాబును ఎవరు ఏ ఒక్క మాట అన్నా విరుచుకుపడే వారు. ఏ మీడియాలో చూసినా.. ఏ పేపర్లో చూసినా వీరి వాయిసే వినిపించేది. అయితే, ఇలాంటి ఫైర్ బ్రాండ్లకు ఇప్పుడు పార్టీలో గుర్తింపు ల‌భించ‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌రీ ముఖ్యంగా చంద్రబాబు తాజాగా నియ‌మించిన పార్లమెంట‌రీ జిల్లా క‌మిటీల్లోనూ మ‌హిళా క‌మిటీల్లోనూ.. కొత్తగా ఏర్పాటు చేసిన‌ రెండు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల సంయుక్త క‌మిటీల్లోనూ వీరికి చోటు ల‌భించ‌లేదు.

Also Read: జగన్‌ లేఖతో మోడీ-షాలకు తలనొప్పులు?

చంద్రబాబు అన్నీ ఆలోచించే వీరిని పక్కన పెట్టారా.. లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. మొన్నటి నియామ‌కాల‌ను ప‌రిశీలిస్తే ఎమ్మెల్యేల‌కు, మాజీ ఎమ్మెల్యేల‌కు కూడా అవ‌కాశం ఇచ్చారు. కానీ.. ఈ ఫైర్‌‌బ్రాండ్లను మాత్రం పట్టించుకోలేదు. పార్టీలో పదవులు ఉన్నాయనుకున్నా.. ఈ కమిటీల్లో ప్రస్తుతం పదవులు పొందిన వారు కూడా ఆల్‌రెడీ ఏదో ఒక పదవి అనుభవించిన వారే. మరి చివరకు బాబు ఇలా ఎందుకు చేశారో తెలియకుండా ఉంది.