బండి సంజయ్‌ని హైకమాండ్‌ కంట్రోల్‌ చేసిందా..?

బండి సంజయ్.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌. ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికార పక్షంపై దూకుడుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికలోనూ పోలీసుల తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు గ్రేటర్‌‌ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. పార్టీకి ఇప్పుడు రాష్ట్రంలో ఇంత ఊపు రావడానికి సంజయే కారణమని అందరికీ తెలిసిందే. Also Read: బండి సంజయ్ నన్ను […]

Written By: NARESH, Updated On : November 23, 2020 10:59 am
Follow us on

బండి సంజయ్.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌. ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికార పక్షంపై దూకుడుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికలోనూ పోలీసుల తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు గ్రేటర్‌‌ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. పార్టీకి ఇప్పుడు రాష్ట్రంలో ఇంత ఊపు రావడానికి సంజయే కారణమని అందరికీ తెలిసిందే.

Also Read: బండి సంజయ్ నన్ను మోసం చేశాడు: రాజాసింగ్ సంచలన ఆడియో లీక్

అయితే.. సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు సంజయ్‌ దూకుడుకు హైకమాండ్‌ బ్రేకులు వేసిందా..? గ్రేటర్‌‌ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ చలాన్లు కట్టుకుంటామన్న హామీ జాతీయ స్థాయిలో వైరల్ అయింది. నిబంధనలు ఉల్లంఘించినా తప్పేమీలేదన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. బీజేపీకి యువత మద్దతిస్తున్నారని.. వారికి ఫైన్లు వేస్తున్నారని కవరింగ్ చేసుకునే ప్రయత్నాలు కూడా తేలిపోయాయి. అదే సమయంలో.. భాగ్యలక్ష్మి ఆలయ సందర్శన వ్యవహారం కూడా విమర్శలకు గురి చేసింది. ప్రశాంతమైన హైదరాబాద్‌లో మత కల్లోలాలు రేపే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందన్న అభిప్రాయం ఇతరుల్లో ఏర్పడే అవకాశం కల్పించారని హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: బండిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదా..?

బండి సంజయ్‌ వ్యవహారంతో పార్టీ ఇమేజీ దెబ్బతింటోందని హైకమాండ్‌ భావించిందట. అందుకే.. ఆయన దూకుడును తగ్గించమని చెప్పినట్లు సమాచారం. గ్రేటర్ ప్రచార వ్యూహాన్ని కిషన్ రెడ్డికి అప్పగించినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై ఓ వర్గం మీడియాకు ఢిల్లీ హైకమాండ్ నుంచి లీకులు వచ్చాయి. అయితే.. భారతీయ జనతా పార్టీ ఇలాంటివి పట్టించుకోదు. వివాదాలైనా ఎన్నికల్లో ఏది లాభం చేకూరుస్తుందో.. అది చేసే నేతలకు ప్రాధాన్యం ఇస్తుంది. బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాల వల్లే.. బండి సంజయ్‌ను కంట్రోల్ చేశారన్న ప్రచారం బయటకు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

గ్రేటర్‌లో రెండు రోజుల దూకుడు తర్వాత సంజయ్‌ మరింతగా ప్రజల నోళ్లలో నానారు. ఇది సీనియర్లకు నచ్చలేనట్లుగా తెలుస్తోంది. ప్రధాన నేతగా ఎదుగుతున్నారన్న ఉద్దేశంతో.. హైకమాండ్ వద్ద తమ పలుకుబడి ఉపయోగించి.. కాస్త తగ్గించే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. మరోవైపు.. ఈ వార్త అంతా వట్టిదేనంటూ ఓ వర్గం మీడియా ఇప్పటికే సైబర్‌‌ పోలీసులను ఆశ్రయించింది. తమ చానల్‌ లోగోను వాడి నిందారోపణ వార్త వైరల్‌ చేశారంటూ పేర్కొంది.