జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనకబడుతోంది. జమ్మూ ప్రాంతంలో గుప్ కర్ కూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి.
280 స్థానాలకు 58 స్థానాల్లో గుప్ కర్ కూటమి ఆధిక్యంలో ఉంది. 49 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18, జెకెఏపీ 5, ఇతరులు 34 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. .జమ్మూ కాశ్మీర్ లో కలిపి 20 జిల్లాల్లో 280 డిస్ట్రిక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ లో 8 విడుతలుగా ఎన్నికలు నిర్వహించారు. భారీ బందో బస్తు మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత ప్రభుత్వం ఇక్కడ 370 ఆర్టికల్ రద్దు తరువాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కానున్నందున ఫలితాలు ఎవరికి వస్తాయోనని ఆసక్తి రేపుతోంది.