తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో పార్టీని సైతం ప్రకటించబోతున్నారు. అయితే.. ఇప్పుడు తమిళం వేదికగా ఇదే ప్రధాన చర్చనీయాంశమైంది. పార్టీ రిజిస్ట్రేషన్ తదితర పనులను పూర్తి చేసుకుని తన తాజా సినిమా షూటింగుకు వెళ్లే అవకాశాలున్నట్లుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగూ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు నెలల సమయం ఉండడంతో మధ్యలో నెలన్నర పాటు రజనీకాంత్ తన సినిమా షూటింగ్‌తో బిజీగా గడపనున్నారట.
Also Read: జమిలీకి మోడీ సై.. అన్ని పార్టీలూ ఓకే అనాల్సిందేనా..
రాజకీయాల్లోకి వచ్చే సినిమా నటులు ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచే సినిమాలకు దూరం అవుతున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ.. రజనీకాంత్ మాత్రం అలా కాకుండా మూడు నెలల ముందు వరకూ సినిమా షూటింగులతోనే బిజీగా ఉండేట్టున్నారు. అయితే.. ఇప్పుడు మరో ప్రచారం తెరమీదకు వచ్చింది. రజనీకాంత్ పార్టీ పెడుతున్నా.. ఆయన సీఎం క్యాండిడేట్ కాదట. ఈ విషయాన్ని రజనీకాంతే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. తన పార్టీ అధికారంలోకి వస్తే రజనీకాంత్ మరెవరినో సీఎంగా చేస్తారట.
ఇంతవరకు బాగానే ఉన్నా.. వేరే ఎవరినో సీఎంగా చేస్తే రజనీకాంత్ చెప్పినట్టుగా వాళ్లు వింటారా..? అనేది పెద్ద ప్రశ్న. పోనీ.. తాను సీఎం కాకుంటే ఆ పార్టీకి ప్రజలు పట్టం కడుతారా అనేది మరో అనుమానం. రజనీకాంత్ అభిమాని కూడా ఎవరో ఇదే అడిగారట. తనను సీఎంగా చేయాలంటూ. అలాగే కమల్ హాసన్ కూడా అదే కోరికను బయట పెట్టాడు. రజనీ కాంత్ పార్టీ తో పొత్తు కోసం కమల్ తహతహలాడుతున్నాడు. ఈ విషయంపై రజనీ స్పందించకపోయినా కమల్ చాలా సార్లు స్పందించారు. పొత్తుల గురించి చర్చలకు సిద్ధమని, జనవరిలో చర్చలని కూడా కమల్ అనేశారు.
Also Read: ఢిల్లీకి కోమటిరెడ్డి..ఈ ఇద్దరిలో ఒకరు పీసీసీ చీఫ్
రజనీకాంత్‌కు ఓకే అయితే రెండు పార్టీల తరఫునా తను సీఎం అభ్యర్థిగా ఉండటానికి రెడీ అని కూడా కమల్ చెప్పుకొచ్చారు. అయితే.. రజనీకాంత్ పార్టీ సీఎం అభ్యర్థి ఆయన కాబోడనే వార్తల నేపథ్యంలో.. అన్నాడీఎంకే, బీజేపీలతో రజనీకాంత్ పార్టీ పొత్తు ఊహాగానాలకు మరింత ఊతం లభిస్తూ ఉంది. మొత్తంగా ఎన్నికలు వచ్చే నాటికి.. రజినీ పార్టీ ప్రకటించే నాటికి తమిళ రాజకీయాలు ఇంకా ఎలా మారబోతున్నాయో అంచనా వేయలేని పరిస్థితే ఉంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్