https://oktelugu.com/

జమిలీకి మోడీ సై.. అన్ని పార్టీలు ఓకే అనాల్సిందేనా..

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో జమిలీ ఎన్నికల టాపిక్‌ నడుస్తోంది. మొన్న ప్రధాని మోడీ కూడా మాట్లాడుతూ.. దేశంలో జమిలీ ఎన్నికలు జరిగి తీరాల్సిందేనన్నారు. నిన్న ఈసీ కూడా జమిలీ ఎన్నికలకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించారు. అయితే.. జమిలీ ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకోదని.. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు. ఇందుకు రాజ్యాంగ సవరణ కోసం కూడా బీజేపీకి కావాల్సినంత బలం ఉంది. Also Read: రజనీ కాంత్ పార్టీ ప్రకటన మరింత ఆలస్యం కానుందా? మరోవైపు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 22, 2020 1:41 pm
    Follow us on

    amili Elections
    ప్రస్తుతం దేశ రాజకీయాల్లో జమిలీ ఎన్నికల టాపిక్‌ నడుస్తోంది. మొన్న ప్రధాని మోడీ కూడా మాట్లాడుతూ.. దేశంలో జమిలీ ఎన్నికలు జరిగి తీరాల్సిందేనన్నారు. నిన్న ఈసీ కూడా జమిలీ ఎన్నికలకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించారు. అయితే.. జమిలీ ఎన్నికలపై ఈసీ నిర్ణయం తీసుకోదని.. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు. ఇందుకు రాజ్యాంగ సవరణ కోసం కూడా బీజేపీకి కావాల్సినంత బలం ఉంది.

    Also Read: రజనీ కాంత్ పార్టీ ప్రకటన మరింత ఆలస్యం కానుందా?

    మరోవైపు రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేకపోయినా బిల్లులు పాస్ చేసుకోవడం పెద్ద సమస్య కాదు. జమిలీ ఎన్నికలు పెట్టాలనుకుంటే.. అడ్డుకునే శక్తి ఏ పార్టీకీ లేదు. మోదీ, షా అనుకుంటే జమిలీ ఎన్నికులు ఖాయమే. రాజ్యంగసవరణ చేసి.. మిగతా లాంఛనాలు పూర్తి చేసేస్తారు. కొన్ని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా మోదీ, షాల మాటే నెగ్గుతుంది.

    ఇప్పటికే లా కమిషన్ ద్వారా.. రాజ్యాంగపరంగా చేయాల్సిన మార్పు, చేర్పుల గురించి మోడీ నివేదిక తెప్పించుకున్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలనూ తెలుసుకున్నారు. దీంతో ఈ సారి జమిలీ ఎన్నికలు ఖాయమేనని అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఓ అభిప్రాయం ఏర్పడింది. అందుకే వారంతా ఎన్నికల సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు.

    Also Read: రాయపాటి మోసం: పనిమనిషి, స్వీపర్లు, డ్రైవర్లే డైరెక్టర్లు?

    దేశంలో చాలా వరకు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఢిల్లీ, బెంగాల్ లాంటి.. ఒకటి, రెండు చోట్ల మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో నోరెత్తలేని ముఖ్యమంత్రులు ఉన్నారు. ఫలితంగా.. కేంద్రంపై తమ ప్రయోజనాల కోసం పోరాడే పరిస్థితులు కనిపించడం లేదు. జమిలీని వ్యతిరేకించే పరిస్థితి అంతకన్నా లేదు. జమిలీ ఎన్నికల వల్ల ఏం జరగబోతోందో.. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలకూ ఓ అవగాహన ఉంది. జమిలీ ఎన్నికలు అనేవి భారతీయ జనతా పార్టీ.. తమ రాజకీయ పునాదులను అన్ని చోట్ల అత్యంత బలంగా వేసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయం లేకుండా చేయాలనే లక్ష్యంతో చేస్తోంది. అంతా తెలిసినా ఏ ప్రాంతీయ పార్టీ కూడా కేంద్రం నిర్ణయాన్ని తిరస్కరించే పరిస్థితుల్లో లేవు. మద్దతుగా నిలిచి ఎన్నికలు కోరుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్