
ఐటీ రిటర్న్ దాఖలుకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. వ్యక్తిగత చెల్లింపులకు 10 రోజుల గడువు ఇచ్చింది. వ్యక్తిగత చెల్లింపుదారులు జనవరి 10 వరకు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని సూచించింది. అదేవిధంగా సంస్థలు తమ ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు 15 రోజులు గడువును పెంచింది. ఫిబ్రవరి 15లోపు రిటర్న్‌లు దాఖలు చేయాలని ఆయా సంస్థలకు సూచించింది. కరోనా నేపథ్యంలో గతంలోనూ పలుమార్లు ఐటీ రిటర్న్ దాఖలు గడువును పొడిగించిన విషయం తెలిసిందే.