Ustaad Bhagat Singh Plus And Minus Points: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ సంపాదించుకొని ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మేనియా ను చూశామంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ క్రియేట్ అయింది… ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం…
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీమియర్ షోస్ రివ్యూ…మామూలు రచ్చ కాదుగా..?
ప్లస్ పాయింట్స్
ఈ మూవీలో పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ సేపు కనిపించి తన అభిమానులనైతే అలరించాడు. అలాగే ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. ఇక సెకండాఫ్ లో పవన్ కళ్యాణ్ – శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు సైతం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి… ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు సైతం సినిమాని బాగా ఆకట్టుకున్నాయి..ఇంటర్వెల్ సీన్ లో సైతం పవన్ కళ్యాణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి… సినిమా స్టార్టింగ్ లో వచ్చే పిల్లాడి ఎపిసోడ్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది…
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ చాలా డల్ గా సాగుతుంది.. సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్ చేసే కామెడీ ఏమాత్రం సినిమాకు ప్లస్ అవ్వలేదు. ప్రేక్షకుడిని సైతం ఏమాత్రం నవ్వించలేదనే చెప్పాలి… పవన్ కాలిన ఇతర హీరోల పాటలకు డాన్సులు వేయడం కూడా అంత బాగా సెట్ అవ్వలేదు… ఇక కథ విషయంలో సైతం చాలావరకు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. రొటీన్ కథని తీసుకొచ్చి సినిమా చేశాడు… మొత్తానికైతే పవన్ కళ్యాణ్ స్వాగ్ మీద సినిమాలు నడిపించాలి అనుకున్నాడు. కానీ మరీ రొటీన్ కావడం సీన్స్ ముందు గానే ఊహించే విధంగా ఉండటం తో ప్రేక్షకుడు చాలా వరకు సినిమా నుంచి డిస్ కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…
