https://oktelugu.com/

శరీరంలో వేడి తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

చాలామంది కాలాలతో సంబంధం లేకుండా శరీరంలో వేడి అధికం కావడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. శరీరంలో వేడి ఎక్కువైతే చెమటకాయలు రావడం, చర్మంపై పొక్కులు రావడం జరుగుతుంది. ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. తరచూ జ్వరం వచ్చినట్లు శరీరం వేడిగా అనిపిస్తుంటే సాధారణంగా తీసుకునే నీళ్ల కంటే ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. రోజూ మజ్జిగ తాగడం లేదా అన్నంలో మజ్జిగ వేసుకుని తినడం చేయాలి. Also Read: డయాబెటిస్ రోగులు గుండెను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2020 / 07:22 PM IST
    Follow us on


    చాలామంది కాలాలతో సంబంధం లేకుండా శరీరంలో వేడి అధికం కావడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. శరీరంలో వేడి ఎక్కువైతే చెమటకాయలు రావడం, చర్మంపై పొక్కులు రావడం జరుగుతుంది. ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లను ఈ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. తరచూ జ్వరం వచ్చినట్లు శరీరం వేడిగా అనిపిస్తుంటే సాధారణంగా తీసుకునే నీళ్ల కంటే ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. రోజూ మజ్జిగ తాగడం లేదా అన్నంలో మజ్జిగ వేసుకుని తినడం చేయాలి.

    Also Read: డయాబెటిస్ రోగులు గుండెను కాపాడుకోవడం ఎలా అంటే..?

    నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను డైట్ లో భాగం చేసుకోవాలి. సాంబారు, రసం వీలైనంత తక్కువగా తీసుకుంటే మంచిది. కర్భూజా, ద్రాక్ష, పుచ్చకాయ లాంటి పండ్లను తీసుకోవడం ద్వారా సులభంగా వేడిని తగ్గించుకోవచ్చు. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేడి తగ్గకపోతే మాత్రం వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది. శరీరంలోని వేడిని తగ్గించడంలో దానిమ్మ రసం కూడా సహాయపడుతుంది.

    Also Read: బ్రేక్ ఫాస్ట్ తో సులువుగా బరువు తగ్గవచ్చు.. ఎలా అంటే..?

    నీళ్లలో మెంతులను పొడి చేసి తీసుకున్నా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అధిక వేడి వల్ల కొంతమంది తలనొప్పి, మలబద్ధకం సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ఛాతీ, మణికట్టు భాగాలలో ఐస్ ను రాసినా మంచి ఫలితం ఉంటుంది. చల్లని పాలలో తేనె కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. నుదుటిపై గంధం రాసుకున్నా శరీరంలో వేడి తగ్గుతుంది. గసగసాలను పొడి చేసి నీళ్లలో కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    నిమ్మరసం,అలోవేరా జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో, ఆఫీస్ లో వీలైనంత వరకు గాలి తగిలే ప్రదేశంలో కూర్చోవాలి. థైరాయిడ్ ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నా వేడి పెరుగుతుందని తెలుస్తోంది. ఎక్కువగా చెమట పడుతుంటే డాక్టర్ ను సంప్రదించి సలహాలు తీసుకుంటే మంచిది.