https://oktelugu.com/

ఇక నా క్రికెట్ జీవితానికి సెలవు..

టీం ఇండియా బౌలర్ సుదీప్ త్యాగి క్రికెట్ నుంచి తప్పుకొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఫాస్ట్ బౌలింగ్ లో ఆరి తేరిన సుదీప్ భారత్ క్రికెట్ తరుపున మొత్తం నాలుగు వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్ లో ఆడారు. వన్డేల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ లో 14 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు తీసుకున్నాడు. 41 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి 109 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా […]

Written By: , Updated On : November 18, 2020 / 10:03 AM IST
Follow us on

టీం ఇండియా బౌలర్ సుదీప్ త్యాగి క్రికెట్ నుంచి తప్పుకొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఫాస్ట్ బౌలింగ్ లో ఆరి తేరిన సుదీప్ భారత్ క్రికెట్ తరుపున మొత్తం నాలుగు వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్ లో ఆడారు. వన్డేల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్ లో 14 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు తీసుకున్నాడు. 41 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడి 109 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా ఆయన ఆయన ఓ లేఖను ట్విట్టర్లో ఉంచాడు. ‘ఇక నా క్రికెట్ జీవితానికి సెలవు. టీం ఇండియా జట్టులో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు. క్రికెట్ లోని ప్రతి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నాను’అని పేర్కొన్నాడు. ప్రత్యేకంగా తనకు అవకాశమిచ్చిన ధోనికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సురేశ్ రైనా, ఆర్పీ సింగ్, మహ్మద్ కైఫ్లలతో ఆడినందుకు సంతోషంగా ఉందన్నారు.