గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూరత్ నుంచి పావగఢ్ కు వెళ్తున్న లారీ వడోదర శివారులోని వాగోడియా క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న వంతెనపై కండెయినర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిని చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ రుపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా మృతుల కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.