ఆస్ట్రేలియా రెండో టెస్టులో భారత్ ఘన విజయం

ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. నాలుగరు రోజుల పాటు జరిగిన టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నిర్ధారించగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్ మొత్తానికి గెలుపొందింది. నాలుగో రోజు ఆడిన టెస్టులో రహనే 27, శుభ్మన్ గిల్ 35 పరుగులు అందించి 15 ఓవర్లలో జట్టును గెలిపించారు. అంతకుముందు మయాంక్ అగర్వాల్ 5, పూజారా 3 పరుగులు మాత్రమే […]

Written By: Suresh, Updated On : December 29, 2020 9:51 am
Follow us on

ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. నాలుగరు రోజుల పాటు జరిగిన టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నిర్ధారించగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్ మొత్తానికి గెలుపొందింది. నాలుగో రోజు ఆడిన టెస్టులో రహనే 27, శుభ్మన్ గిల్ 35 పరుగులు అందించి 15 ఓవర్లలో జట్టును గెలిపించారు. అంతకుముందు మయాంక్ అగర్వాల్ 5, పూజారా 3 పరుగులు మాత్రమే చేశారు. నాలుగో రోజు టెస్టు 133 స్కోరుతో మంగళవారం ఆట ప్రారంభించిన టీమిండియా ఆసీస్ మరో 67 పరుగుల సాధించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇదే ఆసీస్ సోమవారం 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంగళవారం జరిగిన టెస్టులో బుమ్రా బౌలింగ్ లో కమిన్స్ మయాంక్ చేతికి చిక్కడంతో కష్టాల్లో పడింది. మరో 21 పరుగుల తరువాత సిరాజ్ బౌలింగ్ లో గ్రీన్ ఔటయ్యాడు. అప్పటికి ఆసీస్ 177 స్కోరుతో సాగుతోంది. దీంతో సిరాజ్ బౌలింగ్ లోనే లైయన్ ఔటయ్యాడు. చివర్లో హేజిల్ వుడ్, మిచెల్ కలిసి 14 పరుగుల చేసి మైదానం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో 70 ఆసీస్ 70 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ముందుగా మయాంక్ అగర్వాల్, పూజారా ఔటైనా రహనే, శుబ్ మణ్ వీరోచితంగా పోరాటి జట్టును విజయం వైపు నడిపించారు.